
వెండితెరపై ఓ జంట కెమిస్ట్రీ పండిందంటే వారిద్దరిపై వరుస గాసిప్‌లు వస్తుంటాయి. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణం. అలాంటి గాసిప్‌లు ఈ మధ్య ప్రభాస్, అనుష్కలపై వస్తున్నాయి. వీరిద్దరి మధ్య వున్న కెమిస్ట్రీ కూడా ఈ వార్తలకు ఆజ్యం పోస్తోంది. ఇద్దరు కలిసి మిర్చి. బాహుబలి చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాల్లోనూ వీరి కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. దీంతో ఇద్దరి మధ్య ఏదో వుందని, ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వరుస కథనాలు వినిపించాయి.
ఈ వార్తలపై ఇద్దరు క్లారిటీ ఇచ్చినా పుకార్లు మాత్రం ఆగలేదు. తాజాగా ఓ రియాలిటీ షోలో పాల్గొన్న అనుష్కని ఈ విషయం అడిగితే ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. ప్రభాస్‌తో తనకున్నది స్నేహం మాత్రమేనని, అంతకు మించి తమ ఇద్దరి మధ్య ఏమీ లేదని స్పష్టం చేసింది. అయితే యాంకర్ సుమ మాత్రం ఈ రెండింటిలో ఏదో ఒకటి మానేయమని అడిగితే ఏది మానేస్తారని రెండు ఆప్షన్‌లు ఇచ్చింది. ఒకటి ప్రభాస్‌తో స్నేహం, రెండు సినిమాల్లో నటించడం. దీనికి అనుష్క నుంచి అదిరిపోయే సమాధానం వచ్చింది. ప్రభాస్ స్నేహం కోసం సినిమాల్లో నటించడం మానేస్తానని చెప్పేయడంతో అంతా అవాక్కయ్యారు.
అనుష్క నటించిన తాజా చిత్రం `నిశ్శబ్దం`. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో కోన వెంకట్‌తో కలిసి టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 2న విడుదల చేయాలనుకున్న ఈ చిత్రాన్ని చిత్ర బృందం కరోనా వైరస్ కారణంగా వాయిదా వేశారు. ఎప్పుడు రిలీజ్ చేసేది ఈ నెలాఖరున వెల్లడించనున్నారట.