Homeటాప్ స్టోరీస్రిప‌బ్లిక్ టీవి అర్న‌బ్‌కు చెప్పు పుర‌స్కారం!

రిప‌బ్లిక్ టీవి అర్న‌బ్‌కు చెప్పు పుర‌స్కారం!

రిప‌బ్లిక్ టీవి అర్న‌బ్‌కు చెప్పు పుర‌స్కారం!
రిప‌బ్లిక్ టీవి అర్న‌బ్‌కు చెప్పు పుర‌స్కారం!

అర్న‌బ్ గోస్వామి.. జాతీయ మీడియాలో ఓ టెర్ర‌ర్‌. ఎలాంటి టాపిక్ అయినా స‌రే అర్న‌బ్ ధాటికి కుదేలైపోవాల్సిందే. అధికార బీజేపీకి అర్న‌బ్ కొమ్ము కాస్తున్నారంటూ గ‌త కొంత కాలంగా బ‌హిరంగ విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అయినా వాటిని అర్న‌బ్ ఏమాత్రం ల‌క్క‌చేయ‌కుండా త‌ను అనుకున్న‌ది చేసుకుంటూ పోతున్నారు. టీవీ చ‌ర్చ‌ల్లో ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చ‌మ‌ట‌లు ప‌ట్టించే అర్న‌బ్ త‌న‌కు న‌చ్చిన వారికి మాత్ర‌మే చ‌ర్చ‌ల్లో మాట్లాడే అవ‌కాశం ఇస్తుంటార‌న్న‌ది మ‌రో విమ‌ర్శ‌.

న‌చ్చ‌ని వారిని మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడ‌నివ్వ‌రు. అత‌ని వాగ్ధాటిని త‌ట్టుకుని ఎదురు ప్ర‌శ్నించే వాళ్లు చాలా త‌క్కువే. తెలంగాణ బిల్లు స‌మ‌యంలో పార్ల‌మెంట్ స‌భ్యుల‌పై పెప్ప‌ర్ స్ప్రే చేసిన అప్ప‌టి కాంగ్రెస్ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌ని లైవ్‌లో అర్న‌బ్ ఫుట్‌బాల్ ఆడుకోవ‌డం అప్ప‌ట్లో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. అత‌ని ధాటికి త‌ట్టుకోలేక ల‌గ‌డ‌పాటి చేతులెత్తేశాడు. రాజ‌కీయ నాయ‌కులు, బాలీవుడ్ సెల‌బ్రిటీలు అర్న‌బ్‌తో త‌ల‌ప‌డాలంటే భ‌య‌ప‌డుతుంటారు.

- Advertisement -

అలాంటి అర్న‌బ్‌కి చెప్పు పుర‌స్కారం ఇచ్చాడు బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్‌. వావాదాస్పద ద‌ర్శ‌కుడిగా పేరున్న అనురాగ్ క‌శ్య‌ప్ గురువారం క‌మెడియ‌న్ కునాల్ క‌మ్రాతో క‌లిసి ముంబైలోని రిప‌బ్లిక్ టీవి చాన‌ల్ ముందు చెప్పు ని ఓ ఫ్రేమ్‌గా లాబినేట్ చేసి అర్నబ్ జ‌ర్న‌లిజంలో ల‌భించిన పుర‌స్కారంగా అందించాల‌ని ప్ర‌య‌త్నించారు. ఇది గ‌మ‌నించి సెక్యూరిటీ అడ్డుకోవ‌డంతో రిప‌బ్లిక్ చాన‌ల్ ముందు నిల‌బ‌డి ఫొటోల‌కు పోజులిచ్చారు. ఆ ఫొటోలిప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All