Homeటాప్ స్టోరీస్8 మిలియ‌న్ క్ల‌బ్‌లో చేరింది!

8 మిలియ‌న్ క్ల‌బ్‌లో చేరింది!

8 మిలియ‌న్ క్ల‌బ్‌లో చేరింది!
8 మిలియ‌న్ క్ల‌బ్‌లో చేరింది!

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.. `ప్రేమ‌మ్‌` మూవీతో మ‌ల‌యాళంలో ఎంట్రీ ఇచ్చిన ఈ క‌ర్లీంగ్ హెయిర్ బ్యూటీ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. ఆ త‌రువాత `అఆ`తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది. ఇందులో `ప్రేమ‌మ్‌`కు భిన్నంగా క‌నిపించి నాగ‌వ‌ల్లిగా ఆక‌ట్టుకుంది. వ‌ల్లిగా త‌న‌లోని మ‌రో యాంగిల్‌ని చూపించి మ‌న ప‌క్కింటి అమ్మాయిలా తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్ని కొల్ల‌గొట్టింది.

ఈ ముద్దు గుమ్మ‌కు సోష‌ల్ మీడియాలో భారీ ఫ్యాన్ బేసే వుంది. అమెని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా పెద్ద‌దే. తాజాగా అనుప‌మ 8 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌ని క్రాస్ చేసింది. ఈ విష‌యాన్ని వినూత్నంగా వెల్ల‌డించింది. రెండు చేతుల్లో 8 క్యాండీ చాక్లెట్స్‌ని వినూత్నంగా చూపిస్తూ 8 మిలియ‌న్స్ క్ల‌బ్‌లో చేరానంటూ సింబాలిక్‌గా చెప్పేసింది. థ్యాంక్యూ ఆల్‌.. ల‌వ్ ల‌వ్ ల‌వ్ అంటూ షేర్ చేసింది.

- Advertisement -

ఇన్‌స్టాలో 558 మందిని ఫాలో అవుతున్న అనుప‌మ ఇప్ప‌టి వ‌రకు 967 పోస్ట్‌లని షేర్ చేసింది. ప్ర‌స్తుతం తెలుగు భాష‌పై ప‌ట్టు సాధించ‌డం కోసం తెలుగు నేర్చుకుంటున్న అనుప‌మ `18 పేజెస్‌` చిత్రంలో న‌టిస్తోంది. నిఖిల్ హీరోగా న‌టిస్తున్న ఈ మూవీని సుకుమార్‌తో పాటు బ‌న్నీ వాసు నిర్మిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All