Homeటాప్ స్టోరీస్లక్కంటే అనిల్ రావిపూడిదే!

లక్కంటే అనిల్ రావిపూడిదే!

లక్కంటే అనిల్ రావిపూడిదే!
లక్కంటే అనిల్ రావిపూడిదే!

కొంత మందికి ఏది చేసినా టైమ్ క‌లిసి రాదు.. కానీ కొంత మందికి మాత్రం టైమ్ వ‌రుస‌గా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంటుంది. ఒకేసారి డ‌బుల్ ధ‌మాకాని అందిస్తుంటుంది. యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడికి ఇదే త‌ర‌హా అదృష్టం వ‌రించింది. స్టార్ హీరోతో సినిమా చేసి డైరెక్ట‌ర్‌గా స్టార్ స్టేట‌స్ ని ఎంజాయ్ చేయాల‌ని ప్లాన్ చేసుకున్న అనిల్ రావిపూడికి అనుకోకుండా మ‌హేష్ రూపంలో అదృష్టం త‌లుపుత‌ట్టింది. `ఎఫ్‌2`లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ విప‌రీతంగా న‌చ్చేయ‌డంతో వెంట‌నే అనిల్‌తో సినిమాకు మ‌హేష్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేసిన విష‌యం తెలిసిందే. దీంతో అంబ‌రాన్నంటిన సంబ‌రంలో వున్న అనిల్‌కు ఆదివారం మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలింది.

ఆదివారం ఆయ‌న భార్య డెలివ‌రీ అయింది. పండంటి మ‌గ బిడ్డ జ‌న్మించాడు. బాబు, త‌ల్లి క్షేమంగా వున్నార‌ని డాక్ట‌ర్లు తెలియ‌జేశారు. దీంతో అనిల్ రావిపూడి ఇంట సంక్రాంతి పండ‌గ సంబ‌రాలు ముందే మొద‌ల‌య్యాయి. సంక్రాంతికి `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమాతో బ‌రిలోకి దిగుతున్న అనిల్ రావిపూడికి ఇదే స‌మ‌యంలో బాబు పుట్ట‌డంతో ఆయ‌న‌కు ఈ సంక్రాంతి డ‌బుల్ ట్రీట్ ఇచ్చింద‌ని, ఆయ‌న ఇంట డ‌బుల్ సెల‌బ్రేష‌న్స్ మొద‌ల‌వుతున్నాయని అంతా అభినందిస్తున్నారు.

- Advertisement -

ఒకే టైమ్‌కి రెండు బ‌హుమ‌తులు అంటూ ఆయ‌న‌కు ఈ సంక్రాంతి డ‌బుల్ బొనాంజాని అందించింద‌ని ల‌క్కంటే అనిల్ రావిపూడిదే అంటున్నారు. ప్రిన్స్ మ‌హేష్ హీరోగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న `స‌రిలేరు నీకెవ్వ‌రు` ఈ నెల 11న రిలీజ్ కాబోతున్న విష‌యం తెలిసిందే. ఈ రోజు రాత్రి 9 గంట‌ల‌కు చిత్ర బృందం ఈ చిత్ర థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు. దీంతో ఈ రోజు నుంచి మ‌హేష్ ఫ్యాన్స్ హంగామా మొద‌లు కాబోతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All