Homeటాప్ స్టోరీస్ఆంధ్రోళ్ల పై నరనరాల్లో విషం నింపుకున్న కేసీఆర్

ఆంధ్రోళ్ల పై నరనరాల్లో విషం నింపుకున్న కేసీఆర్

Andhra people fires on KCRఉద్యమ సమయంలో ఆంధ్రోళ్ల పై విషం చిమ్మిన కేసీఆర్ , తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాత్రం ఆంధ్రోళ్ల ఓట్ల కోసం మీ కాలులో ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తాను అంటూ కాకమ్మ కబుర్లు చెప్పి ఓట్లు వేయించుకొని , ఇప్పుడేమో మళ్ళీ తెలంగాణలో ఎన్నికలు వచ్చిన సమయం చూసుకొని మళ్ళీ ఆంధ్రవాళ్ల పై విషం కక్కుతున్నాడు కేసీఆర్ అంటూ మండిపడుతున్నారు సీమాంధ్రులు . తెలంగాణ ఎన్నికలు సమీపించిన ఈ తరుణంలో ఇప్పటి వరకు తెలంగాణలో చేసిన అభివృద్ధి గురించి చెప్పుకొని ఓట్లు అడగాలి కానీ ఇంకా చంద్రబాబు ని తిడుతూ ఓట్లు అడగడం తోనే కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని అందుకే పదేపదే చంద్రబాబు ప్రస్తావన తెస్తున్నాడని , చంద్రబాబు ని తిట్టకుండా ఒక్క సభలో కూడా కేసీఆర్ మాట్లాడటం లేదు ఇక్కడే అతడి భయం ఏంటో తెలిసిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

పాకిస్థాన్ వాళ్ళని కూడా మిత్రులుగా భావించే కేసీఆర్ సాటి తెలుగువాళ్లు అయిన ఆంద్రోళ్ళు ఎలా శత్రువులు అవుతారు , చంద్రబాబు ని తెలంగాణ నుండి తరిమేసా ? ఆంధ్రా నాయకులను తన్ని తరిమేసిన ? మళ్ళీ చంద్రబాబు పెత్తనం మనకు కావాల్నా ? ఒకసారి ఆలోచన చేయమని ప్రజలను కోరే కేసీఆర్ …….. ఆంద్రోళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి తమ జీవితాలను ఫణంగా పెట్టారు , ఇక్కడి వాళ్లకు జీవనోపాధి కల్పించారు అదే సీమాంధ్రులు చేసిన తప్పా ? మమ్మల్ని తెలంగాణ నుండి తన్ని తరిమేయడానికి తెలంగాణ నీ అయ్య జాగీరా ? కేసీఆర్ అంటూ నిప్పులు చెరుగుతున్నారు ఆంధ్రులు . హైదరాబాద్ లోనే కాకుండా యావత్ తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఆంధ్రా నుండి వచ్చి రకరకాల రంగాల్లో పెట్టుబడులు పెట్టి దశాబ్దాలుగా ఇక్కడ జీవనం సాగిస్తుంటే , తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములం అయితే మాపై విషం కక్కుతూ ఓట్లప్పుడు మాత్రం ఆంధ్రావాళ్ల సంక నాకుతూ ఓట్లడుగుతావా ? తెలంగాణలో నీ పరిపాలనకు నాలుగున్నర సంవత్సరాల వయసుంది కదా ! ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చేసిన పనులు ఏంటో చెప్పి ఓట్లు అడగాల్సింది పోయి చంద్రబాబు ని ఆంధ్రోళ్ల ని తిడుతూ పబ్బం గడుపుకోవడానికి సిద్దమయ్యావా ? అంటూ నిప్పులు చెరుగుతున్నారు సీమాంధ్ర ఓటర్లు . మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణ ని అప్పుల్లో కురుకుపోయేలా చేసి అసమర్దన పాలన చేస్తూ , ప్రతిపక్షాలు విమర్శించాయి కాబట్టి ఎన్నికలకు పోతున్నా అంటూ 9 నెలల ముందే అసెంబ్లీ ని రద్దు చేసిన చేతకాని ముఖ్యమంత్రి వి ? ఒక్క రోజు కూడా సెక్రటేరియట్ కు వెళ్లకుండా ప్రగతి భవన్ లోనే పండుకున్న నువ్వా ? మమ్మల్ని విమర్శించేది ? ప్రజలను కలవకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆంధ్రోళ్ల ఓట్లని ఎలా అడుగుతావ్ ? గెలిస్తే సేవ చేస్తా ? ఓడగొడితే ఇంట్లో కూర్చుంటా అని చెప్పే నువ్వు నాయకుడివా ? అంటూ కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . అంతేకాదు కేసీఆర్ ని మట్టికరిపించే క్షణం కోసం ఓటు అనే ఆయుధంతో యుద్దానికి సిద్ధం అవుతున్నారు .

- Advertisement -

English Title: Andhra people fires on KCR

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All