Homeటాప్ స్టోరీస్వ‌ర్మ‌కు దిమ్మ‌దిరిగే షాకిచ్చిన యాంక‌ర్‌!

వ‌ర్మ‌కు దిమ్మ‌దిరిగే షాకిచ్చిన యాంక‌ర్‌!

వ‌ర్మ‌కు దిమ్మ‌దిరిగే షాకిచ్చిన యాంక‌ర్‌!
వ‌ర్మ‌కు దిమ్మ‌దిరిగే షాకిచ్చిన యాంక‌ర్‌!

నాకు కోరిక పుడితే దాన్ని వెంట‌నే తీర్చేసుకుంటా. ఇప్ప‌టికీ నేను కోరుకున్న ప్ర‌తీ కోరిక‌నీ తీర్చుకున్నాను. తీర్చుకోకుండా వున్న కోరిక అంటూ ఏమీ లేదు. ఒక వేళ నేను కోరుకున్న‌ది తీర్చుకోలేని కోరిక అనిపిస్తే దాన్ని అప్పుడే మ‌ర్చిపోతాను. ప‌క్క‌న పెట్టేస్తాను. నిన్ను బికినీలో చూడాల‌ని వుంది. నీకు న‌చ్చితే నేనిచ్చే ఆఫ‌ర్‌కి ఓకే చెప్పు అంటూ రామ్ గోపాల్‌వ‌ర్మ త‌న‌ని ఇంట‌ర్వ్యూ చేసిన యాంక‌ర్‌కు ఝ‌ల‌క్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

తాజాగా మ‌రో యాంక‌ర్‌కు అదే త‌ర‌హా బిస్కెట్ వేసే ప్ర‌య‌త్నం చేసిన వ‌ర్మ‌కు స‌ద‌రు యాంక‌ర్ దిమ్మ‌దిరిగే స్ట్రోక్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. `న‌గ్నం` ఫిల్మ్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా రామ్ గోపాల్ వ‌ర్మ వ‌రుస‌గా యూట్యూబ్ ఛాన‌ల్స్‌కి ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం మొద‌లుపెట్టారు. ఇటీవ‌ల ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌కి ఇంట‌ర్వ్యూ ఇచ్చి యాంక‌ర్‌కే బిస్కెట్ వేసిన వ‌ర్మ తాజాగా మ‌రో యాంక‌ర్‌నూ అదే త‌ర‌హాలో మాయ‌చేయ‌బోయి బుక్క‌య్యాడు.

- Advertisement -

హార్ట్ ఫుల్‌గా చెబుతున్నా నువ్వు న‌మ్మినా న‌మ్మ‌క‌పోయినా నువ్వు బ్యూటిఫుల్‌గా వున్నావు. నువ్వు వుండాల్సింది ఇక్క‌డ కాదు సినిమాల్లో. నీకు ఎనీటైమ్ న‌టించాల‌ని అనిపించినా న‌న్ను కాంటాక్ట్ అవ్వు నీకు వెంట‌నే ఆఫ‌ర్ ఇస్తా. ఇది కెమెరా ముందు సీరియ‌స్‌గా చెబుతున్నా` అని యాంక‌ర్ చంద‌న‌ని బుట్ట‌లో వేసే ప్ర‌య‌త్నం చేశాడు వ‌ర్మ‌. దీనికి స‌మాధానంగా మిమ్మ‌ల్ని ఇంట‌ర్వ్యూ చేసిన ప్ర‌తీ యాంక‌ర్‌నీ ఇలాగే అంటుంటారు క‌దా?  అనే స‌రికి వ‌ర్మ నోట మాట రాలేదు. ఊహించ‌ని పంచ్‌కి వ‌ర్మ సైలెంట్ అయిపోయాడ‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All