
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబుగా ప్రశంసలు అందుకున్న చిత్రం `రంగస్థలం`. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అనసూయ వేసిన రంగమ్మత్త పాత్ర ప్రధాన హైలైట్‌గా నిలిచింది. హీరోయిన్ సమంత పాత్రని కూడా ఒక దశలో డామినేట్ చేసింది అనసూయ. సైమా అవార్డుల్లో ప్రత్యేక పురస్కారాన్ని సొంతం చేసుకుంది.
అప్పటి నుంచి సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తోంది. తనకు నచ్చిన, తను మాత్రమే చేయదగ్గ పాత్రల్లో నటిస్తూ నటిగా మరపురాని పాత్రల్ని ఎంచుకుంటోంది. `యాత్ర`లో చరితా రెడ్డిగా ఆకట్టుకున్న అనసూయ పాత్ర చిన్నదైనా గుర్తిండిపోయే పాత్రల్నే ఎంచుకుంటోంది. తాజాగా అలాంటి మరో పాత్రలో నటించడానికి రెడీ అయిపోతోంది.
అల్లు అర్జున్ `పుష్ప`లో పవన్‌కల్యాణ్ `వకీల్‌సాబ్`, చిరంజీవి `ఆచార్య`, నితిన్ `అంధాదున్` రీమేక్ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్న అనసూయ తాజాగా క్రియేటీవ్ డైరెక్టర్ కష్ణవంశీ తెరకెక్కిస్తున్న `రంగమార్తాండ` చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె పాత్ర దేవదాసి అని తెలిసింది. సినిమాలో ఈ పాత్రకు ప్రాధాన్యత వుంటుందని తెలిసింది.