Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ తమ్ముడ్ని టార్గెట్ చేసిన సమంత

విజయ్ దేవరకొండ తమ్ముడ్ని టార్గెట్ చేసిన సమంత

సమంత విజయ్ దేవరకొండ తమ్ముడ్ని టార్గెట్ చేసింది . విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ” దొరసాని ” , ఆ సినిమా జూలై 5 న విడుదల కానుంది . కాగా అదే రోజున అంటే జూలై 5 నే సమంత నటించిన ” ఓ బేబీ ” చిత్రం కూడా రిలీజ్ కానుంది . నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ బేబీ చిత్రం కొరియా చిత్రానికి రీమేక్ కావడం విశేషం . ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే చిత్రం ఓ బేబీ .

- Advertisement -

ఇక దొరసాని చిత్రానికి వస్తే ఆనంద్ దేవరకొండ – శివాత్మిక జంటగా నటించగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కింది . ఈ సినిమా జూలై 5 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అంటే ఒకే రోజున రెండు సినిమాలు వస్తున్నాయి . మరి ఈ రెండు చిత్రాల్లో దేనికి ప్రేక్షకులు ఓటేస్తారో కానీ సమంత చిత్రానికి కాస్త ఎక్కువ ఓపెనింగ్స్ రావడం అయితే ఖాయం . ఆ తర్వాత సినిమా టాక్ ని బట్టి ఏది హిట్టో ? ఏది ఫట్టో ? తేలుతుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All