
ఎవడు, ఐ, 2.0 వంటి సినిమాలతో సౌత్ లో సుపరిచితం అయిన నటి అమీ జాక్సన్ గర్భవతి అన్న విషయం అందరికీ తెల్సిందే. తను ప్రేమించిన జార్జిను కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకున్న అమీ జాక్సన్ ఇప్పుడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అమీ జాక్సన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
గ్రీకు సంప్రదాయం ప్రకారం తాత పేరును బిడ్డకు పెట్టారు. తనను ఆండ్రియాస్ గా ప్రపంచానికి పరిచయం చేసింది అమీ. ఈ విషయాన్ని తెలుసుకున్న ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు, శ్రేయోభిలాషులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
- Advertisement -
Credit: Instagram
- Advertisement -