Homeటాప్ స్టోరీస్నాకు మగబిడ్డే పుడతాడు అంటున్న అమీ జాక్సన్!

నాకు మగబిడ్డే పుడతాడు అంటున్న అమీ జాక్సన్!

amy jackson
amy jackson

రాంచరణ్ తో ‘ఎవడు’, చిత్రంలో ‘అభినేత్రి’ చిత్రాల్లో తళుక్కున మెరిసిన అందాల తార అమీజాక్సన్. గతేడాది విడుదలైన ‘2.ఓ’ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నటించిన అమీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. సినిమాలతో కేరియర్ సక్సెస్ ఫుల్ గా ఉండగానే బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్‌ పనాయొటోతో ఆమె కొంతకాలంపాటు డేటింగ్‌లో ఉన్నారు. డేటింగ్‌ అనంతరం వారిద్దరూ నిశ్చితార్థం చేసుకుని పెళ్లిచేసుకున్నారు..!

ఇప్పుడు అమీజాక్సన్‌ తల్లి కాబోతుంది. . దీనికి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు తన సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల ఆమె సన్నిహితులతో కలిసి బేబీ షవర్‌ వేడుకను జరుపుకున్నారు. ఈ పార్టీలో తనకు పుట్టబోయేది మగబిడ్డేనంటూ ఆమె ప్రకటించారు.

- Advertisement -

శుక్రవారం ఆమె తన ఇన్‌స్టా వేదికగా పుట్టబోయే బేబీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. బేబీ కోసం రూపొందించిన ఒక చిన్న ఉయ్యాల ఫొటోను షేర్‌ చేస్తూ‘మేము నీ కోసం ఎదురుచూస్తున్నాం’అంటూ క్యాప్షన్‌ ఇచ్చి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. బేబీ షవర్‌కు సంబంధించిన మరో ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘బేబీ షవర్‌ వేడుక చాలా బాగా జరిగింది. నాకు పుట్టబోయే మగబిడ్డ ఎంతో అదృష్టవవంతుడు. ఇంతమంది అద్భుతమైన ఆడవాళ్లు తనతో ఉన్నారు’ అనే వ్యాఖ్యను జతచేశారు.. ప్రస్తుతం ఆమె మాతృత్వపు ఆనందాన్ని ప్రతిక్షణం ఆస్వాదిస్తున్నారు..!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All