Homeటాప్ స్టోరీస్అమృతం ద్వితీయం అంతా బానే ఉంది కానీ...

అమృతం ద్వితీయం అంతా బానే ఉంది కానీ…

అమృతం ద్వితీయం అంతా బానే ఉంది కానీ...
అమృతం ద్వితీయం అంతా బానే ఉంది కానీ…

సీరియల్స్ అంటే అది కేవలం ఆడవాళ్లు ఆస్వాదించే ఒక ఎంటర్టైన్మెంట్ గా మారిపోయింది. ఇప్పుడు కాదు కొన్ని దశాబ్దాల నుండీ అదే జరుగుతూ వస్తోంది. సీరియల్స్ అంటే ఏడుపుగొట్టు సన్నివేశాలు, వెకిలి కామెడీ అనే అభిప్రాయం జనాల్లో బలంగా నాటుకుపోయింది. అయితే ఒకే ఒక్క సీరియల్ అటు ఆడవాళ్లను, వాళ్ళకంటే ఎక్కువగా మగవాళ్ళను, పిల్లలను.. ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకుంది. కొన్ని ఏళ్ల పాటు చిన్న తెరను ఏలింది ఆ సీరియల్. అదే అమృతం. గుణ్ణం గంగరాజు మదిలో మెదిలిన ఆలోచన నుండి పుట్టుకొచ్చిన ఈ అమృతం కొన్నేళ్ల పాటు అందరి ఫెవరెట్ సీరియల్ గా మన్ననలు అందుకుంది. ఈ సీరియల్ ను 5 సార్లు రీ టెలికాస్ట్ చేశారంటేనే అర్ధం చేసుకోవచ్చు ప్రేక్షకులలో దీనికున్న క్రేజ్ ఏపాటిదో. అంతే కాకుండా దాదాపు మూడు ఛానల్స్ వారు ఈ సీరియల్ ను టెలికాస్ట్ చేసుకున్నారు. అంతటి ఘనచరిత్ర ఉన్న అమృతం ఇప్పుడు రెండో భాగంతో సిద్ధమైంది.

అమృతం ద్వితీయం… మూర్ఖత్వానికి మరణం లేదు అనే ఉపశీర్షికతో ఈ సీరియల్ వస్తోంది. తెలుగువారికి ప్రసిద్ధమైన పండగ ఉగాది నుండి ఈ సీరియల్ ప్రసారమవుతుంది. అమృతం ద్వితీయంలో ప్రధాన పాత్రధారులు అమృతంలో చేసిన వాళ్లే ఉన్నారు. అమృతం, అప్పాజీ, సర్వం ఇలా అన్ని పాత్రలకూ వాళ్ళే నటిస్తున్నారు. అయితే అంజి పాత్రలో చేసిన గుండు హనుమంతరావు ప్రస్తుతం మన మధ్య లేకపోవడంతో ఆయన స్థానంలో ఎల్బీ శ్రీరామ్ ను తీసుకున్నారు. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. ప్రేక్షకులు అందరూ ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

- Advertisement -

అంతా బాగానే ఉంది కానీ ఈ సీరియల్ జీ5 యాప్ లో మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. జీ టీవీలో ప్రసారం కాబోదట. జీ5 యాప్ అంటే అందరి దగ్గరా ఉండే అవకాశం లేదు. ఒకవేళ డౌన్ లోడ్ చేసుకున్నా ఉచితంగా ఇచ్చే అవకాశాలు తక్కువే. ఇదొక్కటే అమృతం ద్వితీయంకు మైనస్ గా మారే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All