Homeటాప్ స్టోరీస్ఫాలోవ‌ర్స్ పెర‌గాలంటే బిగ్‌బి చిట్కా!

ఫాలోవ‌ర్స్ పెర‌గాలంటే బిగ్‌బి చిట్కా!

ఫాలోవ‌ర్స్ పెర‌గాలంటే బిగ్‌బి చిట్కా!
ఫాలోవ‌ర్స్ పెర‌గాలంటే బిగ్‌బి చిట్కా!

అమితాబ్ బ‌చ్చ‌న్ సోష‌ల్ మీడియాలో గ‌త కొంత కాలంగా యాక్టీవ్‌గా వుంటున్నారు. లాక్ డైన్ స‌మ‌యం కావ‌డంతో మ‌రింత‌గా ట్విట్ట‌ర్ , ఇన్ స్టా గ్రామ్‌ల లో వ‌రుస‌గా ఫొటోలు పెడుతూ ఆక‌ట్టుకుంటున్నారు. ఫ్యాన్స్‌తో స‌రికొత్త సంగ‌తుల్ని పంచుకుంటున్నారు. `షోలే` ప్రీమియ‌ర్ షోకి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌తో పాటు ఓ ఫొటోని పంచుకున్న బిగ్‌బి తాజాగా షేర్ చేసిన ఓ ఫోటొ నెటిజ‌న్స్‌తో పాటు ఫ్యాన్స్‌ని, సెల‌బ్రిటీల‌ని అవాక్క‌య్యేలా చేసింది.

గ‌త కొంత కాలంగా వ్యంగ్యంగా పోస్ట్‌లు పెడుతూ నెటిజ‌న్స్‌తో పాటు ఫ్యాన్స్‌లోనూ ఆస‌క్తిని క్రియేట్ చేస్తున్న అమితాబ్ బ‌చ్చ‌న్ తాజాగా త‌న ఫొటోని ఇన్ స్టా వేదిక‌గా పోస్ట్ చేశారు. ఆ ఫొటో చూసిన వారంతా అవాక్క‌వుతున్నారు. ఇంత‌కీ ఆ ఫొటోలే ఏముందంటే అమితాబ్ 37 ఏళ్ల క్రితం  `మ‌హాన్‌` చిత్రంలో బ‌నియ‌న్‌, చెడ్డీ ధ‌రించి న‌టించారు. అదే ఫొటోని షేర్ చేసిన ఆయ‌న ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు.

- Advertisement -

త‌న ఇన్ స్టా పేజీకి అత్య‌ధిక ఫాలోవ‌ర్స్, కామెంట్స్ రాక్పోవ‌డానికి కార‌ణం వుంద‌ని కొంత మంది నాతో చెప్పారు. కార‌ణం ఏంటంటే నేను బికినీ ఫొటోలు పెట్ట‌క పోవ‌డం వ‌ల్లే త‌న పేజీకి ఫాఓవ‌ర్స్ పెర‌గ‌డం లేద‌ని, లైక్‌లు, కామెంట్‌లు యువ‌త చేయ‌డం లేద‌ని చెప్పారు. అలా అన్న‌ప్పుడు నాకు గుర్తొచ్చిన ఫొటో ఇదే. ఇది నేను `మ‌హాన్‌` చిత్రంలో న‌టించిన స్టిల్ ఇది. ఈ చిత్రంలో నేను త్రిపాత్రాభిన‌యం చేశాను. ఈ సినిమా విడులై ఇప్ప‌టికి 37 ఏళ్ల‌వుతోంది. అని పోస్ట్ చేశారు. దీనిపై బిగ్‌బి ఫ్యాన్స్‌, నెటిజ‌న్స్ కామెంట్‌లు పెడుతున్నారు.

Credit: Instagram

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All