
కరోనా వైరస్ దేశంలో శరవేగంగా ప్రబలుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు ఆచి తూచి వ్యవహరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయినా ఎవరూ ఆ నిబంధంనల్ని పాటించడం లేదు. సామాన్యలతో పోలిస్తే తాజా నిబంధనల్ని సెలబ్రిటీలే అత్యధికంగా అధిగిమించి తమకు తెలిసిన సమాచారమే కరెక్ట్ అన్నట్టుగా వ్యవహరిస్తే విమర్శల పాలవుతున్నారు. ఇటీవల ట్విట్టర్ వేదికగా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పోస్ట్ చేసిన వీడియోపై నెటిజన్స్ విమర్శలు చేయడంతో ఆ విడియోని స్వయంగా ట్విట్టర్ డెలీట్ చేసింది.
ఇదిలా వుంటే బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా తాజాగా అలాంటి తప్పిదమే చేసి నెటిజన్స్ చేతిలో అడ్డంగా బుక్కవ్వడం ఆసక్తికరంగా మారింది. జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రధాని మోదీ డాక్టర్లకు, పోలీస్ శాఖకు సంఘీభావంగా ఆదివారం 5 గంటలకు ప్రజలంతా తమ చప్పట్లతో హర్షాన్నివ్యక్తం చేయాలని సూచించారు. దీనిపై అమితాబ్ పోస్ట్ పెట్టడం వివాదంగా మారింది.
అయితే అమితాబ్ మాత్రం ఆదివారం అమావాస్య కాబట్టి చప్పట్లు కొట్టడం, శంఖం ఊదడం, గంట కొట్టడం వల్ల వైరస్ నశిస్తుందని ట్వీట్ చేయడంతో నెటిజన్స్ ఆయన్ని ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. ఈ రోజుల్లో మూఢనమ్మాకలేంటని, మీలాంటి వారు కూడా ఇలా ట్వీట్ చేయడం ఏమీ బాగాలేదని విమర్శలు గుప్పించారు. దీంతో అమితాబ్ ఆ ట్వీట్‌ని వెంటనే డిలీట్ చేశారు.