
బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇటీవల కరోనా వైరస్‌కు గురైన విషయం తెలిసిందే. దీని కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన అమితాబ్ బచ్చన్ ఆ తరువాత కోరుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చిన ఆయన మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో షూటింగ్‌కి రెడీ అవుతున్నారు. ఇటీవల కోన్ బనేగా కరోడ్ పతి 12వ సీజన్ సెలక్షన్స్ కోసం స్టూడియోకు వెళ్లిన బిగ్ బీకి ఆ తరువాత కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే.
కౌన్ బనేగా కరోడ్ పతి కారణంగా కోవిడ్‌కు గురైన అమితాబ్ మళ్లీ అదే ప్రోగ్రామ్‌కు సిద్ధం కావడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత కొంత కాలంగా కౌన్ బనేగా కరోడ్ పతి షోకు అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతోందంటూ ట్వీట్ చేసిన బిగ్‌బీ ఈ షో షూటింగ్‌లో తను పాల్గొంటున్నట్టు ప్రకటించారు. తనకు ఈ షోతో వున్న 20 ఏళ్ల అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
కెబీసీకి సెట్‌కి సంబంధించిన ఫొటోలని ఈ సందర్భంగా షేర్ చేశారు. తిరిగి పనిలోకి వచ్చాను. నీలిరంగు పీపీఇ కిట్‌లు ధరించిన వారితో కలిసి షూటింగ్ చేస్తున్నాను. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ షో ఈ ఏడాదితో 20 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఇది తన జీవితకాలం గుర్తంటుందని బిగ్‌బీ ట్వీట్ చేశారు.