Friday, March 24, 2023
Homeటాప్ స్టోరీస్మళ్లీ పెళ్లి చేసుకుంటానంటున్న భామ

మళ్లీ పెళ్లి చేసుకుంటానంటున్న భామ

Amala paul thinking on second marriageప్రేమించి పెళ్లి చేసుకొని కొద్దిరోజులు కాపురం చేసాక భర్తతో వచ్చిన విబేధాలతో అతడికి విడాకులు ఇచ్చిన బ్లాక్ బ్యూటీ అమలా పాల్ మళ్లీ పెళ్లి చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేసింది. అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని ప్రేమించి , విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా విడాకులు ఇచ్చిన తర్వాత రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ పిచ్చ షాక్ ఇస్తోంది ఈ భామ . అంతేకాదు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంత బోల్డ్ గా నైనా నటించడానికి నాకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించి మరింత సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే పలుమార్లు అందాల ఆరబోతతో ఫోటో షూట్ చేయగా తాజాగా మరో హాట్ ఫోటో షూట్ చేసి మరింత షాక్ ఇచ్చింది అమలాపాల్.

- Advertisement -

పెళ్లికి ముందు అందాల ఆరబోతలో కాస్త నియమాలను పెట్టుకుంది కానీ విడాకులు తీసుకున్న తర్వాత మాత్రం వీర లెవల్లో రెచ్చిపోయింది. ఇక తాజాగా అమలాపాల్ చేసిన ఫోటో షూట్ పిచ్చెక్కించేస్తోంది. అంతేనా మళ్లీ నేను రెండో పెళ్లి చేసుకుంటానని , అలాగే రాజకీయాల్లోకి కూడ వస్తానని కూడా అంటోంది . అయితే రాజకీయాలలోకి రావడానికి మాత్రం కాస్త సమయం పడుతుందని అంటోంది. ఇక రెండో పెళ్లి కూడా ఇప్పుడే కాదని ప్రస్తుతం నా దృష్టి అంతా సినిమాల మీదే ఉందని , క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంత బోల్డ్ గా నైనా నటించడానికి నాకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది అమలా పాల్ . తెలుగులో ఈ భామకు పెద్దగా అవకాశాలు రావడం లేదు కానీ తమిళంలో మాత్రం వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

English Title: Amala paul thinking on second marriage

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts