Homeటాప్ స్టోరీస్హైయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో `బాహుబ‌లి`ని బీట్ చేసిన అల్లు శిరీష్ మూవీ

హైయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో `బాహుబ‌లి`ని బీట్ చేసిన అల్లు శిరీష్ మూవీ

Allu Sirish beats Baahubali 2
Allu Sirish beats Baahubali 2

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగుతో పాటు మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లోనూ బ్ర‌హ్మాండ‌మైన ఇమేజ్ వున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న న‌టించిన చిత్రాలు మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీల్లో డ‌బ్బింగ్ అవుతూ అక్క‌డ సంచ‌ల‌న విజ‌యాల్ని సాధిస్తున్నాయి. ఇక యూట్యూబ్‌లో హిందీ వెర్ష‌న్‌లకు రికార్డు స్థాయి వ్యూస్ ల‌భిస్తున్నాయి. అల్లు అర్జున్ న‌టించిన స‌రైనోడు, అల్లు శిరీష్ న‌టించిన `ఏబీసీడీ (అమెరిక‌న్ బార్న్ క‌న్ఫ్యూజ్డ్ దేశీ) చిత్రాలకు గ‌త వారం అత్య‌ధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన హిందీ డ‌బ్బింగ్ చిత్రాలుగా చ‌రిత్ర సృష్టించాయి.

బార్క్ రేటింగ్స్ ఆధారంగా హిందీ ప్రేఊక్ష‌కులు సరైనోడు, ఏబీసీడీ సినిమాల‌పై ఎక్కువ ఆస‌క్తిని చూపించార‌ని రేటింగ్స్ చెబుతున్నాయి. స‌రైనోడు, ఏబీసీడీ సినిమాల‌కు 4863, 4016 యావ‌రేజ్ మినిట్ ఆడియ‌న్స్ వ‌చ్చింది. `బాహుబ‌లి ది కంక్లూజ‌న్` కంటే ఇది ఎక్కువ కావ‌డం గ‌మ‌నార్హం. అదే వారం `బాహుబ‌లి` కూడా టీవీలో ప్ర‌సార‌మైంది. దీనికి 3609 యావ‌రేజ్ ఆడియ‌న్స్ న‌మోద‌య్యారు.

- Advertisement -

త‌మ సినిమాపై హిందీ ప్రేక్ష‌కులు చూపించిన ప్రేమ‌పై అల్లు శిరీష్ స్పందించారు. త‌న సినిమాకు నిజంగా ఇంత అద్భుత‌మైన రేటింగ్స్ వ‌స్తాయ‌ని అనుకోలేద‌ని, హిందీ ప్రేక్ష‌కులు త‌న పై చూపించిన ప్రేమ‌ని మాట‌ల్లో చెప్ప‌లేన‌న్నారు. ఈ సినిమాలో వినోదం కార‌ణంగా వాళ్లు అంత బాగా క‌నెక్ట్ అయ్యార‌ని శిరీష్ చెప్పుకొచ్చారు. ఒక న‌టుడిగా వాళ్ల‌ని అల‌రించ‌డానికి త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌న్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All