Homeటాప్ స్టోరీస్మాకు 10వ వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌లు : అల్లు అర్జున్‌

మాకు 10వ వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌లు : అల్లు అర్జున్‌

మాకు 10వ వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌లు : అల్లు అర్జున్‌
మాకు 10వ వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌లు : అల్లు అర్జున్‌

స్టార్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు శ‌నివారం అల్లు అర్జున్ నేమ్‌ని టాప్‌లో ట్రెండ్ చేస్తున్నారు. కార‌ణం ఈ హీరో పెట్టిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్. వివ‌రాల్లోకి వెళితే.. అల్లు అర్జున్‌, స్నేహారెడ్డిల 10వ మ్యారేజ్ యానివ‌ర్స‌రీ నేడు. ఇదే విష‌యాన్ని బ‌న్నీ ట్విట్ట‌ర్‌తో పాటు ఇన్ స్టా గ్రామ్ వేదిక‌గా వెల్ల‌డించారు. అంతే కాకుండా భార్య స్నేహారెడ్డితో క‌లిసి ప్రేమ‌కు చిహ్న‌మైన ఆగ్రాలోని తాజ్ మ‌హ‌ల్ ముందు నిల‌బ‌డి ఫొటోల‌కు పోజులిచ్చారు.

ఆ ఫొటోతో పాటు, స్నేహ‌రెడ్డి ప‌దేళ్ల క్రితం స‌రిగ్గా ఇదే రోజు వేద‌మంత్రాల సాక్షిగా తాళిక‌డుతున్న ఫొటోని అభిమానుల‌తో పంచుకున్నారు. `మాకు 10 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. పదేళ్లు ఎంత అద్భుతమైన ప్రయాణం … ఇంకా చాలా రాబోతున్నాయి` అని ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం బ‌న్నీ చేసిన ఈ ట్వీట్ ని ఆయ‌న అభిమానులు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.

- Advertisement -

బ‌న్నీ, స్నేహా రెడ్డిల‌ది పెద్ద‌లు కుదిర్చిన ప్రేమ పెళ్లి అన్న విష‌యం తెలిసిందే. గ‌త ప‌దేళ్లుగా వీరి వైవాహిక జీవితం ఎంతో అందంగా సాగుతోంది. వీరికి ఇద్ద‌రు పిల్లలు కూడా వున్నారు. ఇదిలా వుంటే అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఆగ‌స్టు 13న ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All