Homeటాప్ స్టోరీస్స్టార్ హీరో సెట్‌లో బుల్లి బుడ‌త‌డి హంగామా!

స్టార్ హీరో సెట్‌లో బుల్లి బుడ‌త‌డి హంగామా!

allu ayan hungama in ala vaikuntapuramulo sets
allu ayan hungama in ala vaikuntapuramulo sets

స్టార్ హీరో అల్లు అర్జున్ క‌థానాయికుడిగా న‌టిస్తున్న చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`.  మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. యంగ్ హీరో సుశాంత్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ సంక్రాంతి బ‌రిలో ఈ నెల 12న రిలీజ్ అవుతున్న ఈ చి త్రంపై స‌ర్వ‌త్రా అంచ‌నాలు నెలకొన్నాయి. ఆ అంచ‌నాల‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో సినిమా వుండ‌బోతోంద‌ని ల్యాబ్ రిపోర్ట్ చెబుతోంది.

ఇటీవ‌లే సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్ర మేకింగ్ వీడియోని చిత్ర బృందం శుక్ర‌వారం విడుద‌ల చేసింది. ఈ సినిమాకు సంబంధించిన సీన్‌ల‌కు ముందు న‌టీన‌టులకు ద‌ర్శ‌కుడు సూచ‌న‌లు ఇస్తున్న తీరుతో పాటు సెట్‌లో అల్ల అర్జున్ న‌టించిన దృశ్యాలు కూడా ఆక‌ట్టుకుంటున్నాయి. అయితే ఈ సెట్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న‌యుడు అల్లు అయాన్ చేసిన హంగామా మామూలుగా లేదు. కెమెరామెన్ స్థానంలో కూర్చుని అల్లు అయాన్ చూస్తున్న వీడియో అల‌రిస్తోంది.

- Advertisement -

అయితే ఇదే స‌మ‌యంలో కెమెరామెన్ చైర్ నుంచి రారా అని బ‌న్నీ పిలిస్తే `అయామ్ ది ప్రొడ్యూస‌ర్ ఆఫ్ ది ఫిల్మ్` అని అయాన్ చెప్ప‌డంతో సెట్‌లో వున్న వాళ్లంతా గొల్లున న‌వ్వేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో సంద‌డి చేస్తోంది. అల్లు అయాన్ తీరు చూసిన వాళ్లంతా `అయాన్.. యూ ఆర్ రాకింగ్` అంటూ కామెంట్‌లు పెడుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All