
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో `ఐకాన్` చిత్రాన్ని ప్రకటించిన వివషయం తెలిసిందే. అత్యంత భారీ స్థాయిలో నిర్మాంచాలిన నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేసిన ఈ పాన్ ఇండియా మూవీ గత కొన్ని నెలలుగా సందిగ్ధంలో పడింది. `వకీల్ సాబ్` సక్సెస్ తరువాత `ఐకాన్` మళ్లీ పట్టాలెక్కడం ఖాయం అనే వార్తలు వినిపించాయి.
నిర్మాత దిల్ రాజు కూడా మా నెక్స్ట్ ప్రాజెక్ట్ `ఐకాన్` అని ఇటీవల జరిగిన పాత్రికేయుల సమావేశంలో స్పష్టం చేశారు. అయితే హీరో అల్లు అర్జునే వుంటాడా అన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. దీంతో అల్లు అర్జున్ ఇందులో నటించడం కష్టమనే వాదన మొదలైంది. కారణంగా ఇటీవల స్క్రిప్ట్‌లో బన్నీ కొన్ని కీలకమైన మార్పులను సూచించాడని, ఇది నిర్మాత దిల్ రాజుతో పాటు దర్శకుడు శ్రీరామ్ వేణుతోకు నచ్చలేదని, ఆ కారణంగానే ఈ ప్రాజెక్ట్ కు బ్రేక్ పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
దీంతో `ఐకాన్` నుంచి బన్నీ తప్పుకున్నారని, అతని స్థానంలో మరో స్టార్ హీరో కోసం దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బన్నీ అభిమానులు `ఐకాన్` చేయి జారినట్టేనా అని ఫీలవుతున్నారట. ఇందులో ఏది నిజం అన్నది తెలియాలంటే బన్నీ స్పందించే వరకు వేచి చూడాల్సిందే.