Homeటాప్ స్టోరీస్సైరా ..... లో అల్లు అర్జున్ కూడానా

సైరా ….. లో అల్లు అర్జున్ కూడానా

allu arjun guest role in sye raa narasimha reddyమెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ” సైరా …… నరసింహారెడ్డి ”. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తుండగా ఇప్పటికే నిహారిక ఓ గిరిజన యువతి గా నటించనున్నట్లు ప్రకటించగా అల్లు అర్జున్ కూడా గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది . తెలుగు , తమిళ్ , హిందీ బాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో సంచలనం సృష్టించగా తాజాగా మరికొంతమంది స్టార్స్ యాడ్ అవుతుండటంతో హాట్ కేక్ కానుంది . అల్లు అర్జున్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది అయితే అధికారికంగా చిత్ర బృందం ప్రకటించాల్సి ఉంది .

చిరంజీవి తో పాటుగా అమితాబ్ బచ్చన్ , జగపతి బాబు , నయనతార , విజయ్ సేతుపతి , నిహారిక లతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు ఇక వాళ్లకు అల్లు అర్జున్ కూడా తోడైతే కేకో కేక . అల్లు అర్జున్ మాత్రమే కాకుండా మెగా కుటుంబం లోని ఇతర హీరోలు కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది . ఆగస్టు 22 న చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని చిరంజీవి లుక్ తో పాటుగా టీజర్ ని కూడా విడుదల చేయనున్నారు .

- Advertisement -

English Title: allu arjun guest role in sye raa narasimha reddy

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All