Homeటాప్ స్టోరీస్సైరా నరసింహారెడ్డి సెట్ ని కూల్చేశారు

సైరా నరసింహారెడ్డి సెట్ ని కూల్చేశారు

revenue officials demolished sye raa narasimhareddy setsమెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నచిత్రం సైరా …. నరసింహారెడ్డి . కాగా ఈ చిత్రం కోసం భారీ సెట్ ని వేశారు కాగా ఆ సెట్ ని రెవిన్యూ అధికారులు కూల్చేశారు . రెవిన్యూ అధికారుల తీరుతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది ఆ చిత్ర బృందం . సంఘటన వివరాలలోకి వెళితే …… శేరిలింగం పల్లి రెవిన్యూ పరిధిలోగల ఓ స్థలం వివాదంలో ఉంది అది ప్రభుత్వ స్థలం కాగా ఓ వ్యక్తి అద్దెకు ఇచ్చుకుంటున్నాడు . ఇక చరణ్ నటించిన రంగస్థలం సెట్ ని కూడా అక్కడే వేశారు దాంతో ఆ పక్కనే సైరా నరసింహారెడ్డి సెట్ వేశారు . గతకొద్ది రోజులుగా ఆ సెట్ లో షూటింగ్ జరుగుతోంది కూడా .

అయితే రెవిన్యూ అధికారుల అనుమతి తీసుకోకుండా సెట్ వేయడమే కాకుండా సెట్ వేసినందుకు నోటీసులు పంపించారట అధికారులు కానీ ఎన్ని నోటీసులు పంపించినా సైరా బృందం నుండి సమాధానం రాలేదు పైగా వాళ్లకున్న సమాచారం ప్రకారం ఆ సెట్ లో ఉన్న స్థలాన్ని కూడా కబ్జా చేయడానికి సైరా బృందం ప్రయతించిందని అందుకే సైరా సెట్ కూల్చేశామని చెబుతున్నారు అధికారులు . మా అనుమతి తీసుకుంటే అవసరమైతే స్థలాన్ని అద్దె లేకుండా ఇచ్చేవాళ్లమని కానీ మా అనుమతి తీసుకోలేదు సరికదా నోటీసులు పంపించినా స్పందించలేదు అందుకే కూల్చేశాం అని అంటున్నారు . మరి ఈ విషయం పై చిరంజీవి , చరణ్ లు ఎలా స్పందిస్తారో చూడాలి .

- Advertisement -

English Title: revenue officials demolished sye raa narasimhareddy sets

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All