Homeటాప్ స్టోరీస్మ‌ళ్లీ `రేసుగుర్రం` కాంబినేష‌న్?

మ‌ళ్లీ `రేసుగుర్రం` కాంబినేష‌న్?

Allu arjun and Surendar reddy team up again
Allu arjun and Surendar reddy team up again

అల్లు అర్జున్ ఇటీవ‌ల `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం బ‌న్నీ కెరీర్‌లోనే అత్య‌ధిక వసూళ్ల‌ని సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన స‌క్సెస్ ఆనందంలో వున్న బ‌న్నీ జ‌న‌వ‌రి నుంచి స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తూనే సుకుమార్ సినిమాకి రెడీ అవుతున్నాడు.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ ఓ ఊర‌మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్‌ని నిర‌వ‌ధికంగా వాయిదా వేశాయి. ఈ ఖాలీ టైమ్‌లో త‌న గెట‌ప్‌తో పాటు చిత్తూరు భాష‌పై ప‌ట్టు సాధిస్తున్నార‌ట అల్లు అర్జున్‌. `అల స‌క్సెస్‌తో మంచి జోష్ మీదున్న అల్లు అర్జున్ ఈ సినిమా త‌రువాత వ‌రుస‌గా సినిమాలు చేయాల‌ని ఫిక్స్ అయ్యాడ‌ట‌.

- Advertisement -

సుక్కు సినిమా త‌రువాత వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఐకాన్‌` చిత్రం చేయ‌నున్న బ‌న్నీ దానితో పాటు మ‌రో చిత్రాన్ని కూడా లైన్‌లో పెట్టిన‌ట్టు తెలిసింది. ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవితో `సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రాన్ని తెర‌కెక్కించిన సురేంద‌ర్‌రెడ్డితో బ‌న్నీ ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. గ‌తంలో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో `రేసుగుర్రం` వంటి హిట్ చిత్రం రూపొందిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All