Tuesday, August 16, 2022
Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ క్రేజ్ అక్కడ మాములుగా లేదుగా!

విజయ్ దేవరకొండ క్రేజ్ అక్కడ మాములుగా లేదుగా!

విజయ్ దేవరకొండ క్రేజ్ అక్కడ మాములుగా లేదుగా!
విజయ్ దేవరకొండ క్రేజ్ అక్కడ మాములుగా లేదుగా!

విజయ్ దేవరకొండ చాలా తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న నటుడు. పట్టుమని పది సినిమాలు కూడా చేయకుండానే ఇప్పుడు విజయ్ దేవరకొండ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. ఇరవయ్యేసి సినిమాలు చేసినా నితిన్, నాగ చైతన్య వంటి వారికి రాని మార్కెట్ విజయ్ కు అరడజను సినిమాలతోనే వచ్చేసింది. అంతెందుకు, స్వయంగా మెగాస్టార్ చిరంజీవి, తాను రెండు దశాబ్దాలు కష్టపడితే స్టార్ స్టేటస్ సంపాదించుకున్నానని, విజయ్ కు కేవలం రెండేళ్లలో స్టార్ స్టేటస్ వచ్చేసిందని చెప్పడం చూస్తే అతని క్రేజ్ ఏ లెవెల్లో పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు.

- Advertisement -

ప్రస్తుతం దర్శకులు కూడా యంగ్ హీరోతో సినిమా అంటే ముందు విజయ్ దేవరకొండనే ప్రిఫర్ చేస్తున్నారు. విజయ్ స్క్రీన్ ప్రెజన్స్ అతనికి మెయిన్ ప్లస్ పాయింట్. అటు అగ్రెసివ్ గా, ఇటు సాఫ్ట్ గా ఎలాంటి క్యారెక్టర్ లోనైనా ఇమిడిపోయే నటుడుగా తనకి మంచి పేరు వచ్చేసింది. లాస్ట్ గా విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ అట్టర్ ప్లాప్ అయినా కూడా ప్రస్తుతం సినిమాల విషయంలో ఎటువంటి ఢోకా లేదు. ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ చేస్తోన్న విజయ్ దేవరకొండ, జనవరి నుండి పూరి జగన్నాథ్ ఫైటర్ చేయనున్నాడు. అలాగే హీరో అని అప్పట్లో ఆపేసిన ప్రాజెక్ట్ కూడా ఒకటి ఉంది. ఇవన్నీ కాకుండా శివ నిర్వాణ ఇటీవలే కలిసి ఒక ప్రాజెక్ట్ కు ఓకే చెప్పించుకున్నాడు. రెండు రోజుల క్రితం అనిల్ రావిపూడి, విజయ్ దేవరకొండను కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇవన్నీ తెలుగులో విజయ్ కు క్రేజ్ ఉందని తెలిపే ఉదాహరణలు. తనకు కేవలం తెలుగులోనే కాక మిగతా భాషల్లో కూడా క్రేజ్ ఎక్కువగా ఉంది. అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో సౌత్ లో మీరు డెబ్యూ చేస్తే ఏ హీరో పక్కన చేస్తారు అని అడగ్గానే శ్రీదేవి కూతురు జాన్వీ తడుముకోకుండా విజయ్ పేరు చెప్పింది. అలాగే మరో సందర్భంలో నిద్ర లేచి ఒక మగాడిగా మారిపోతే ఎవరిలా ఉండాలనుకుంటారు అని ఆమెను అడిగితే కూడా విజయ్ పేరే చెప్పింది. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో హీరోయిన్ గా చేసిన కియారా కూడా సౌత్ లో నుండి తనకిష్టమైన హీరోల్లో విజయ్ ఒకరని, తనతో సినిమా అంటే ఏం చూసుకోకుండా ఓకే చెప్పేస్తానని సెలవిచ్చింది.

ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండతో కలిసి రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా భట్ కూడా ఇటీవలే విజయ్ పై చేసిన వ్యాఖ్యలు అతని క్రేజ్ ను తెలియజేస్తున్నాయి. ఈ ఏడాదికి మోస్ట్ రొమాంటిక్ స్టార్ ఎవరు అంటే అలియా, విజయ్ పేరు చెప్పడం గమనార్హం. బాలీవుడ్ లో ప్రస్తుతం ఎంతో మంది హీరోలు ప్రామిసింగ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఆమె ఎవరి పేరైనా చెప్పి ఉండవచ్చు. కానీ ఆమె విజయ్ పేరు చెప్పడం, అతని క్రేజ్ ను తెలియజేస్తోంది.

ఇవన్నీ చూసే విజయ్ తన తర్వాత చిత్రం ఫైటర్ ను ప్యాన్ ఇండియా లెవెల్లో తీయాలనుకుంటున్నాడు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts