Homeటాప్ స్టోరీస్రూమ‌ర్‌ల‌కు చెక్ అలియా పాట‌తో రెడీ!

రూమ‌ర్‌ల‌కు చెక్ అలియా పాట‌తో రెడీ!

రూమ‌ర్‌ల‌కు చెక్ అలియా పాట‌తో రెడీ!
రూమ‌ర్‌ల‌కు చెక్ అలియా పాట‌తో రెడీ!

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్నారు. హాలీవుడ్ చిత్రం `మోట‌ర్ సైకిల్ డైరీస్‌` ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ప్రారంభం నుంచి దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సష్టిస్తోంది. తొలి సారి ఇద్ద‌రు సూప‌ర్‌స్టార్‌లు క‌లిసి న‌టిస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రం మ‌రింత హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్ టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్. రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచేసింది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ చిత్రం ఇప్ప‌టికే 80 శాతంచిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తున్న అలియాభ‌ట్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన‌లేదు.

- Advertisement -

దీంతో అలియాభ‌ట్ ఈ చిత్రం నుంచి త‌ప్పుకుంద‌ని, రాజ‌మౌళి మ‌రో హీరోయిన్ కోసం అన్వేష‌ణ ప్రారంభించార‌ని పుకార్లు మొద‌ల‌య్యాయి. అయితే అవి పుకార్లేన‌ని, అలియాభ‌ట్ ఈ చిత్రం నుంచి త‌ప్పుకోలేద‌ని చిత్ర బృందం ఇండైరెక్ట్‌గా ప్ర‌క‌టించింది. అలియాభ‌ట్ మే నుంచి షూటింగ్‌లో పాల్గొన‌బోతున్న‌ట్టు తెలిసింది. రామ్‌చ‌ర‌ణ్‌, అలియా పాల్గొన‌గా ఓ పాట‌తో షూటింగ్ చేయ‌బోతున్నార‌ని తాజా స‌మాచారం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All