Homeటాప్ స్టోరీస్`ఆర్ ఆర్ ఆర్‌`లో ఆమె కోసం స్పెష‌ల్ సాంగ్‌?

`ఆర్ ఆర్ ఆర్‌`లో ఆమె కోసం స్పెష‌ల్ సాంగ్‌?

`ఆర్ ఆర్ ఆర్‌`లో ఆమె కోసం స్పెష‌ల్  సాంగ్‌?
`ఆర్ ఆర్ ఆర్‌`లో ఆమె కోసం స్పెష‌ల్ సాంగ్‌?

బాహుబ‌లి, కేజీఎఫ్ చిత్రాల త‌రువాత దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న మూవీ `ఆర్ ఆర్ ఆర్‌`. జ‌క్క‌న్న రాజ‌మౌళి `బాహుబ‌లి` వంటి సంచ‌ల‌న చిత్రం త‌రువాత చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రానికి భారీ క్రేజ్ ఏర్ప‌డింది. ఆ క్రేజ్‌కి త‌గ్గ‌ట్టుగానే సినిమాని స‌గ‌టు ప్రేక్ష‌కుడి ఊహ‌కంద‌ని స్థాయిలో రూపొందిసస్తున్నాడు. దాదాపు 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్‌లోని ఆర్ ఎఫ్ సీలో జ‌రుగుతోంది.

రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ తో అజ‌య్‌దేవ్‌గ‌న్ పాల్గొన‌గా ప‌లు కీల‌క యాక్షన్ ఘ‌ట్టాల్ని ఇటీవ‌ల చిత్రీకరించారు. దీనికి సంబంధించిన ఫొటోల్ని చిత్ర బృందం మీడియాకు రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. చాలా ప్ర‌త్యేక‌త‌ల‌తో, ఊహ‌కంద‌ని ట్విస్ట్‌ల‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్ర‌క‌టించిన తొలి రోజు నుంచే ట్రేడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -

దాదాపు 200 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేయ‌బోతున్న ఈ సినిమా కోసం రాజ‌మౌళి మ‌రో స్పెష‌ల్ ఎఫెక్ట్‌ని రెడీ చేస్తున్నార‌ట‌. ఇందులో బాలీవుడ్ భామ అలియాభ‌ట్ మెగా ప‌వ‌ర్‌స్టార్‌కు జోడీగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె కోసం ప్ర‌త్యేకంగా ఓ సాంగ్‌ని షూట్ చేయాల‌ని, దీని కోసం భారీ రేంజ్‌లో ఖ‌ర్చు చేయాల‌ని రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ పాట సినిమాకు వ‌న్ ఆఫ్ ద హైలైట్‌గా నిలుస్తుంద‌ని చెబుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All