Homeటాప్ స్టోరీస్అల వైకుంఠపురములో రివ్యూ

అల వైకుంఠపురములో రివ్యూ

Ala Vaikunthapurramloo Movie Review
Ala Vaikunthapurramloo Movie Review

నటీనటులు: అల్లు అర్జున్, పూజ హెగ్డే, సుశాంత్, నివేతా పేతురాజ్, సచిన్, సముద్రఖని, జయరాం, మురళీశర్మ, టబు, నవదీప్ తదితరులు
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాణం: ఎస్ రాధాకృష్ణ, అల్లు అరవింద్
విడుదల తేదీ: జనవరి 12, 2020
రేటింగ్: 3.25/5

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గత రెండు చిత్రాలు హిట్ అయిన నేపథ్యంలో మూడో సినిమాపై ఆటోమేటిగ్గా అంచనాలు పెరిగిపోతాయి. దానికి తోడు నాలుగు నెలల నుండి ఈ సినిమా పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయో మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో సంక్రాంతి బరిలో భారీ పోటీ మధ్య విడుదలవుతోంది అల వైకుంఠపురములో. విడుదలకు ముందు భారీ అంచనాలు సృష్టించిన ఈ చిత్రం విడుదలయ్యాక ఎలా ఉంటుందో చూద్దాం.

- Advertisement -

కథ:
బంటు (అల్లు అర్జున్) అంటే మొదటినుండి తన తండ్రి వాల్మీకి (మురళీ శర్మ)కి పడదు. తనకు కావాల్సింది ఇవ్వకపోవడం, సరిగ్గా చూడకపోవడం చేస్తూ ఉంటాడు. చిన్నప్పటినుండి అదే ఫ్రస్ట్రేషన్ తో పెరిగిన బంటు తన బాస్ (పూజ హెగ్డే)ను చూసి ప్రేమలో పడతాడు. ఇదిలా జరుగుతుండగా రామ చంద్ర (జయరాం) తన కొడుకు సుశాంత్ కు పూజ హెగ్డేను ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. రామ చంద్ర బిజినెస్ పై కన్నేసిన విలన్ (సముద్రఖని) అతనిపై దాడి చేయిస్తాడు. అయితే అది ఇటు తిరిగి ఇటు తిరిగి, బంటుకి తన జీవితంలో జరిగిన అతిపెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. దాంతో జయరాం అండ్ ఫామిలీ ఉంటోన్న వైకుంఠపురం (వాళ్ళ ఇల్లు) వెళ్తాడు.

అక్కడ బంటుకి ఎదురైన పరిస్థితులేంటి? అసలు బంటుకి తెలిసిన నిజమేంటి? ఎందుకని వాళ్ళ నాన్న బంటుని ద్వేషిస్తాడు? చివరికి తన బాస్ తో ప్రేమాయణం ఏమైంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే.

నటీనటులు:
అల్లు అర్జున్ కెరీర్ లో అన్ని ఎమోషన్స్ కలగలిసిన మరో పాత్ర ఈ సినిమా ద్వారా దక్కింది. కామెడీ పరంగా కానీ, ఎమోషన్స్ పరంగా కానీ బన్నీ ది బెస్ట్ ఇచ్చాడనే చెప్పాలి. ఫైట్స్ పరంగా కుమ్మేసిన బన్నీ, డ్యాన్సుల్లో చాలా స్టైలిష్ గా కనిపించాడు. మొత్తంగా అల్లు అర్జున్ కు పెర్ఫార్మెన్స్ పరంగా మరో మంచి సినిమా అల వైకుంఠపురములో. పూజ హెగ్డేకు నామ మాత్రపు పాత్రే దక్కింది. అల్లు అర్జున్ ను లవ్ చేయడం మినహా ఆమె చేసేదేం లేదు. సుశాంత్ కు కూడా పెర్ఫార్మన్స్ స్కోప్ పెద్దగా లేదు. నివేతా పేతురాజ్, టబు కథలో భాగమైనా కూడా వాళ్లకు లిమిటెడ్ పాత్రలే దక్కాయి.

మురళి శర్మ ఒక విభిన్నమైన పాత్రలో మెప్పించాడు. తనదైన శైలిలో ఈ చిత్రంలో నటించాడు. తన కెరీర్ లో ఒక రెఫ్రెషింగ్ పాత్ర ఇది. మలయాళ నటుడు జయరాం కూడా మెప్పిస్తాడు. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ లో అతని హావభావాలు బాగుంటాయి. సచిన్ ఖేద్కర్ కు మంచి పాత్ర పడింది. నిజం తెలిసినా దాన్ని దాచి పెట్టి ఉంచాల్సిన పాత్రలో సచిన్ నటన బాగుంది. సునీల్, హర్షవర్ధన్ కు పెద్ద చేసిందేం లేదు. మిగిలినవాళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం:
సాంకేతికంగా అల వైకుంఠపురములో చాలా ఉన్నతంగా తెరకెక్కింది. సినిమాటోగ్రఫీ టాప్ లెవెల్ లో ఉంది. విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. సమజవరగమన చిత్రంలో పారిస్ అందాలను, బుట్ట బొమ్మ చిత్రంలో అందమైన సెట్ ను చూపించిన విధానం అమోఘం. పాటలు ఇప్పటికే అందరికీ చేరువయ్యాయి. థమన్ బెస్ట్ వర్క్స్ లో ఈ చిత్రం టాప్ ప్లేస్ సంపాదిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కూడా మెప్పించాడు థమన్. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. సెకండ్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. కథ పరంగా త్రివిక్రమ్ మరోసారి చాలా సాధారణమైన, ఓల్డ్ పాయింట్ నే ఎంచుకున్నాడు. అయితే దానికి తనదైన శైలి ట్రీట్మెంట్ ఇవ్వడంలో సఫలమయ్యాడు. అయితే నరేషన్ పరంగా కూడా త్రివిక్రమ్ రొటీన్ అవుతున్నాడేమో అనిపిస్తుంది.

విశ్లేషణ:
ఎవరినైనా ఒక స్థానంలో కూర్చోపెట్టగలం కానీ వారికి స్థాయిని మనం తీసుకురాలేం. అది ఎవరికి వారు సంపాదించుకోవాలి. ఇదే పాయింట్ ను త్రివిక్రమ్ తనకు అలవాటైన రీతిలో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. తన రచనతో ఈ పాయింట్ కు బలాన్ని తీసుకొచ్చాడు. అయితే ఒక మూస పద్దతిలో పడిపోతుండడంతో తర్వాత ఏం జరుగుతుంది అనేదానిపై ప్రేక్షకులు ముందే ఒక అంచనాకు వచ్చేస్తారు. కూల్ గా సాగిపోయే కథనం, సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్స్ ప్లస్ కాగా పెద్దగా విలనిజం లేకపోవడం, రొటీన్ అనిపించే వ్యవహారం మైనస్ లు. అయినా కానీ అల వైకుంఠపురములో ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ ఆహ్లాదకర చిత్రం.

Ala Vaikunthapurramuloo Movie Review in English

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All