Homeటాప్ స్టోరీస్అల వైకుంఠపురములో 8 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

అల వైకుంఠపురములో 8 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

అల వైకుంఠపురములో 8 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
అల వైకుంఠపురములో 8 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా అల వైకుంఠపురములో కలెక్షన్స్ మొదటి రోజు నుండి దూసుకుపోతున్న విషయం తెల్సిందే. వరసగా మొదటి నాలుగు రోజులు 10 కోట్ల షేర్ పైన కలెక్షన్స్ ను సాధించి నాన్ బాహుబలి రికార్డును నెలకొల్పిన అల వైకుంఠపురములో సంక్రాంతి అడ్వాంటేజ్ ను ఫుల్ గా ఉపయోగించుకుని ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. ఇక ఈ సినిమాకు సంక్రాంతి తర్వాత కూడా కలెక్షన్స్ స్టడీగా ఉండడంతో ట్రేడ్ పండితులు కూడా విస్తుపోయారు. సెకండ్ వీక్ ను నిన్న అల వైకుంఠపురములో భారీ లెవెల్లో మొదలుపెట్టింది. ఆదివారం సెలవు కావడంతో అల వైకుంఠపురములో దీన్ని క్యాష్ చేసుకుంది.

మొదటి వారంలో 84 కోట్ల పైన షేర్ సాధించిన అల వైకుంఠపురములో 8వ రోజు ఏకంగా 7.8 కోట్ల షేర్ సాధించి మొత్తాన్ని 92 కోట్లకు తీసుకెళ్లింది. అల్లు అర్జున్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా అవతరించింది ఈ సినిమా. ఇక ఈరోజు నుండి వర్కింగ్ డేస్ కావడంతో అల వైకుంఠపురములో చిత్ర పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందన్నది చూడాలి.

- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే నటించింది. ఈ చిత్రంలో సుశాంత్, నివేతా పేతురాజ్, మురళి శర్మ, జయరాం, సచిన్, టబు వంటి వారు కీలక పాత్రలు పోషించారు.

అల వైకుంఠపురములో 8 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

నైజాం : 29.87 కోట్లు
సీడెడ్ : 13.61 కోట్లు
గుంటూరు : 8.83 కోట్లు
ఉత్తరాంధ్ర : 13.85 కోట్లు
తూర్పు గోదావరి : 8.26 కోట్లు
పశ్చిమ గోదావరి : 6.39 కోట్లు
కృష్ణ : 8.47 కోట్లు
నెల్లూరు : 3.45 కోట్లు

ఆంధ్ర + తెలంగాణ : 92.73 కోట్లు

ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో కలిసి పనిచేయనున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All