Homeటాప్ స్టోరీస్గోల్డ్ ట్రైలర్ అదరహో అదరహా

గోల్డ్ ట్రైలర్ అదరహో అదరహా

akshay kumar gold trailer gets super responceఅక్షయ్ కుమార్ హీరోగా నటించిన ” గోల్డ్ ” ట్రైలర్ తాజాగా విడుదల అయ్యింది , 2 నిమిషాల 18 సెకన్ల పాటు ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా అలరించేలా ఉంది . క్రీడల నేపథ్యంలో తెరకెక్కిన దేశభక్తి చిత్రం ఈ గోల్డ్ . అక్షయ్ కుమార్ సరసన హిందీ సీరియల్ నటి నాగిని ఫేమ్ గ్లామర్ గర్ల్ మౌనీ రాయ్ నటించింది . హిందీలో సీరియల్ లలో నటిస్తున్న మౌనీ రాయ్ కి గోల్డ్ చిత్రం మొదటిది .

హాకీ కోచ్ ” తపం దాస్ ” పాత్రలో అక్షయ్ కుమార్ నటించాడు . స్వాతంత్య్రానికి ముందు కాలం 1936 నాటి నుండి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నాటికీ ఈ కథ ముగుస్తుంది . బాలీవుడ్ లో బయోపిక్ లు ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే . ఇప్పటికే పలు చిత్రాలు విజయాలు సాధించగా ఆ కోవలో ” గోల్డ్ ” చిత్రం కూడా చేరడం ఖాయంగా కనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే . రీమా ఖగ్టీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 2018 ఆగస్టు 18 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . హాకీ క్రీడ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అక్షయ్ కుమార్ చాలా ఆశలే పెట్టుకున్నాడు .

- Advertisement -

English Title: akshay kumar gold trailer gets super responce

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All