Homeటాప్ స్టోరీస్రోబో 2 మళ్ళీ వాయిదా

రోబో 2 మళ్ళీ వాయిదా

once again robo sequel postponed 2010 లో వచ్చిన రోబో ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతోంది రోబో 2 ” 2. 0” . అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదాపడింది , తాజాగా ఈ చిత్రం మరోసారి వాయిదాపడిందని తెలుస్తోంది . సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ లు నటించారు . శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది .

అయితే ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకుంది కానీ విఎఫ్ ఎక్స్ పనుల వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతోంది . వి ఎఫ్ ఎక్స్ పనులు అనుకున్న రీతిలో రాకపోవడంతో ఎక్కడా రాజీపడకుండా ఆ పనులపైనే తన దృష్టి పెట్టాడు శంకర్ దాంతో ఈ ఏడాదిలో రోబో 2 విడుదల కష్టమే అని అంటున్నారు అంతేకాదు 2019 లోనే ఆ సినిమా విడుదల ఉంటుందని తెలుస్తోంది . ఇప్పటి వరకు చాలాసార్లు వాయిదాపడిన రోబో 2 తో రజనీకాంత్ బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలి . గతకొంత కాలంగా రజనీకాంత్ చిత్రాలు ఘోర పరాజయాలు పొందుతున్నాయి దాంతో రోబో సీక్వెల్ పైనే ఆశలు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All