Homeటాప్ స్టోరీస్ప్రధానమంత్రి సహాయనిధికి అక్షయ్ కుమార్ రూ.25 కోట్ల విరాళం

ప్రధానమంత్రి సహాయనిధికి అక్షయ్ కుమార్ రూ.25 కోట్ల విరాళం

Akshay Kumar declared Rs.25 Cr for PM- CARES Fund
Akshay Kumar declared Rs.25 Cr for PM- CARES Fund

భారత దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పై పోరాటానికి సినిమా తారలు అందరూ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు “PM- CARES” ఒక కొత్త విభాగం ద్వారా ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో భారత దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసుకోవటం మరియు ఈ పరిస్థితి ద్వారా నష్టపోతున్న ప్రజలు అను ఆదుకునే దిశగా కార్యాచరణ మొదలు పెట్టారు. ఇప్పుడు ప్రధానమంత్రి సహాయ నిధి విభాగానికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రూ.25 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. సినిమాల పరంగా కూడా ఎక్కువగా సామాజిక నేపథ్యం మరియు దేశభక్తి కథాంశాలు గా ఉన్న సినిమాలనే అక్షయ్ కుమార్ చేస్తూ ఉంటారు.

“ప్రస్తుతం ఉన్న సమయంలో మన ప్రజల ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు. మన ప్రజలు భద్రం గా ఉండటానికి మనం అన్ని రకాలుగా ప్రయత్నించాలి.నేను నా వంతుగా నా సంపాదన నుండి 25 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి PM – CARES సహాయనిధికి విరాళం ప్రకటిస్తున్నాను. నా దేశ ప్రజలకు సేవ చేసే దిశగా ఇది నా మొదటి ప్రయత్నం.” అని అక్షయ్ కుమార్ భావోద్వేగభరితమైన సందేశాన్నివిడుదల చేశారు.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All