
అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. బొమ్మరిల్లు భాస్కర్ కొంత విరామం తరువాత చేస్తున్న సినిమా ఇది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. జీఏ 2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ లుక్ టీజర్‌ని సోమవారం చిత్ర బృందం రిలీజ్ చేసింది.
ఈ టీజర్‌లో అఖిల్ ఫార్మల్ డ్రెస్‌లో కనిపించాడు. `హాయ్ ఐయామ్ హర్షా…ఒక అబ్బాయి లైఫ్‌లో 50 పెర్సెంట్ కెరియన్.. 50 పెర్సెంట్ మ్యారీడ్ లైఫ్. కెరియర్‌ని సూపర్‌గా సెట్ చేశాను. ఈ మ్యారీడ్ లైఫే అయ్యయ్యయ్యో.. అంటూ తన క్యారెక్టర్ పడే పాట్లని చెప్పే ప్రయత్నం చేయడం ఆకట్టుకుంటోంది. ఈ నెల 25న ఉదయం 11:40 నిమిషాలకు ఈ మూవీ టీజర్‌ని రిలీజ్ చేయబోతున్నారు.
గత చిత్రాలతో పోలిస్తే ఈ మూవీలో అఖిల్ కొంత చబ్బీగా కనిపిస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రంలో అఖిల్‌ని కొత్తగా ఆవిష్కరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవలే ఈ మూవీ ఫైనల్ షూట్‌ని స్టార్ట్ చేశారు. చివరి దశకు చేరుకుంది. ఈ సంక్రాంతికి ఈ చిత్రాన్నిరిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్.