Homeటాప్ స్టోరీస్సురేంద‌ర్‌రెడ్డి - అఖిల్ మూవీకి ముహూర్తం ఫిక్స్‌!

సురేంద‌ర్‌రెడ్డి – అఖిల్ మూవీకి ముహూర్తం ఫిక్స్‌!

సురేంద‌ర్‌రెడ్డి - అఖిల్ మూవీకి ముహూర్తం ఫిక్స్‌!
సురేంద‌ర్‌రెడ్డి – అఖిల్ మూవీకి ముహూర్తం ఫిక్స్‌!

యంగ్ హీరో అఖిల్ అక్కినేని న‌టిస్తున్న తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌`. కొంత విరామం త‌రువాత `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్ర‌మిది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

ఈ మూవీ త‌రువాత అఖిల్ స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అని‌ల్ సుంక‌రతో క‌లిసి స‌రెండ‌ర్ 2 సినిమా పై సురేంద‌ర్‌రెడ్డి నిర్మించ‌బోతున్నారు. హాలీవుడ్ త‌ర‌హా భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ మూవీ కోసం హాలీవుడ్ ఫైట్ మాస్ట‌ర్స్ ప‌ని చేయ‌బోతున్నారు.

- Advertisement -

ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్స్ వ‌ర్క్ జ‌రుగుతోంది. నెల రోజుల క్రితం ప్ర‌క‌టించిన ఈ ప్రాజెక్ట్ వ‌చ్చే నెల నుంచి ప‌ట్టాలెక్క‌బోతోంది. బిగ్ బ‌డ్జెట్ మూవీగా రూపొంద‌నున్న ఈ మూవీని సంక్రాంతికి లాంఛ‌నంగా ప్రారంభించి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయ‌బోతున్నారు. ఇందులో అఖిల్‌కి జోడీగా ఎవ‌రు న‌టిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All