Homeన్యూస్దీవాళీకి ఆకాష్ పూరీ రొమాంటిక్..!

దీవాళీకి ఆకాష్ పూరీ రొమాంటిక్..!

Akash Puri Romantic Diwali Release Fix
Akash Puri Romantic Diwali Release Fix

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా అనీల్ పాదూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా రొమాంటిక్. పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. సినిమా పూర్తయి చాలా రోజులు అవుతున్నా సరైన సమయం కోసం వెయిట్ చేసిన చిత్రయూనిట్ ఎట్టకేలకు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించింది. దసరా బరిలో భారీ సినిమాలు వస్తుండగా ఆకాష్ పూరీ రొమాంటిక్ సినిమా దీవాళికి టార్గెట్ పెట్టుకున్నారు.

దీపావళి కానుకగా ఆకాష్ పూరీ రొమాంటిక్ సినిమా నవంబర్ 4న రిలీజ్ ఫిక్స్ చేశారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాతో కెతిక శర్మ హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఈ సినిమా రిలీజ్ అవకుండానే కెతిక శర్మకు వరుస ఛాన్సులు వస్తున్నాయి. ఆంధ్రాపోరీ, మెహబూబా తర్వాత ఆకాష్ పూరీ రొమాంటిక్ మూవీ యూత్ టార్గెట్ తో వస్తుంది.

- Advertisement -

రొమాంటిక్ సినిమాకు ఓటీటీ ఆఫర్లు వచ్చినా సరే థియేటర్ లోనే రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఇన్నాళ్లు వెయిట్ చేశారు. రొమాంటిక్ సినిమాలో ఆకాష్ పూరీ, కెతిక శర్మల రొమాంటిక్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All