Homeటాప్ స్టోరీస్డైరెక్టర్ ని తిడుతున్న స్టార్ హీరో ఫ్యాన్స్

డైరెక్టర్ ని తిడుతున్న స్టార్ హీరో ఫ్యాన్స్

Ajith kumar fans angry on director sivaతమిళస్టార్ హీరో అజిత్ ఫ్యాన్స్ డైరెక్టర్ శివ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు . అదేంటి అజిత్ కు వీరమ్ , వేదలమ్ అనే రెండు హిట్స్ ఇచ్చిన దర్శకుడు శివ కాబట్టి అతడంటే అజిత్ ఫ్యాన్స్ ఇష్టపడాలి కానీ తిట్టడం ఏంటి అని అనుకుంటున్నారా ? అవును రెండు సినిమాలు హిట్స్ ఇవ్వడంతో అతడిపై నమ్మకంతో వివేకం అనే సినిమాకు ఛాన్స్ ఇచ్చాడు అజిత్ కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది కాకపోతే భారీ ఓపెనింగ్స్ వచ్చాయి తమిళనాట . దాంతో ఇప్పుడు ఏకంగా నాలుగో చాన్స్ ఇచ్చాడు అజిత్ . తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో ” విశ్వాసం ” అనే సినిమా రూపొందుతోంది . కాగా ఆ సినిమా ఫస్ట్ లుక్ వచ్చింది అయితే ఆ ఫస్ట్ లుక్ అజిత్ ఫ్యాన్స్ కు అస్సలు నచ్చలేదు దాంతో అజిత్ కు మరో ప్లాప్ ఇవ్వనున్నాడా ? అంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అజిత్ ఫ్యాన్స్ .

విశ్వాసం చిత్రాన్ని 2019 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అజిత్ – శివ ల కాంబినేషన్ లో ఇప్పటివరకు మూడు చిత్రాలు రాగా రెండు హిట్స్ ఒకటి ప్లాప్ అయ్యింది . ఇక ఇప్పుడేమో ఫస్ట్ లుక్ పై విశ్వాసం లేకుండా పోవడంతో ఇది కూడా వివేకం లాగే ప్లాప్ అవుతుందేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు . తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అజిత్ ,విజయ్ లకే , విజయ్ ఏమో వరుస విజయాలు సాధిస్తుంటే అజిత్ ని కావాలని వెనక్కి నెట్టేలా చేస్తున్నారని డైరెక్టర్ ని తిడుతూన్నారు .

- Advertisement -

English Title: Ajith kumar fans angry on director siva

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All