Homeటాప్ స్టోరీస్అజిత్ అభిమాని ఆత్మహత్యాయత్నం

అజిత్ అభిమాని ఆత్మహత్యాయత్నం

Ajith
Ajith

తమిళ స్టార్ హీరో అజిత్ అభిమాని ఆత్మహత్యాయత్నం కు పాల్పడ్డ సంఘటన తమిళనాట సంచలనం సృష్టించింది . నిన్న అజిత్ నటించిన ” నెర్కొండ పార్వై ” విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది . ఇక తమిళనాట అజిత్ స్టార్ హీరో కావడంతో పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది వాళ్ళు అన్ని థియేటర్ లను అందంగా ముస్తాబు చేసి పండగ చేసుకున్నారు .

అయితే అభిమాన హీరో సినిమాని మొదటి రోజునే చూడాలనే ఉత్సాహంతో ఉంటారు ఫ్యాన్స్ , అయితే ఓ అభిమాని కి టికెట్ దొరకకపోవడంతో అవమానంగా భావించి రాయపేట లోని సత్యం థియేటర్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు . అయితే సకాలంలో పోలీసులు ఇతరులు స్పందించడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పింది . ఈ విషయాన్నీ శాంతను భాగ్యరాజ్ తెలియజేస్తూ హీరో అజిత్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All