Homeటాప్ స్టోరీస్అజ‌య్ షెడ్యూల్ అప్పుడే పూర్త‌యిందా?

అజ‌య్ షెడ్యూల్ అప్పుడే పూర్త‌యిందా?

Ajay Devgn in RRR shooting completed?
Ajay Devgn in RRR shooting completed?

ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న 2020 వండ‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల తొలి క‌ల‌యిక‌లో వ‌స్తున్న భారీ మల్టీస్టార‌ర్ చిత్రమిది. డీవీవీ దాన‌య్య అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో చిత్రాన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా న‌టిస్తున్నారు.

సినిమాలో ఎన్టీఆర్ భిన్న‌మైన‌ మూడు గెట‌ప్‌ల‌లో క‌నిపించ‌బోతున్నార‌ని ఓ వార్త ఇటీవ‌లే బ‌య‌టికి వ‌చ్చింది. ఎన్టీఆర్ త‌ర‌హాలోనే రామ్‌చ‌ర‌ణ్ కూడా రెండు లేదా మూడు గెట‌ప్‌ల‌లో క‌నిపించే అవ‌కాశం వుందని ఇచ‌త్ర వ‌ర్గాల స‌మాచారం.  ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అలియాభ‌ట్, హాలీవుడ్ న‌టి ఒలివియా, రే స్టీవెన్‌సన్‌తో పాటు అజ‌య్ దేవ‌గ‌న్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -

అజ‌య్ దేవ్‌గ‌న్ ఇటీవ‌లే ఈ చిత్ర షూటింగ్‌లో ఎంట‌ర‌య్యారు. వారం తిర‌క్కుండానే ఆయ‌న‌కు సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల్ని రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌క్క‌న్న పూర్తి చేశార‌ట‌. త‌న షెడ్యూల్ పూర్తి కావ‌డంతో అజ‌య్‌దేవ‌గ‌న్ శుక్ర‌వారం ఉద‌యం ముంబైకి తిరిగి వెళ్లిపోయారు. శంషాబాద్ ఏయిర్‌పోర్ట్‌లో ఆయ‌న సంద‌డి చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో అజ‌య్ షెడ్యూల్ అప్పుడే పూర్త‌యిపోయిందా? అని అంతా అవాక్క‌వుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All