Homeటాప్ స్టోరీస్లైంగిక వేధింపుల గురించి నోరు విప్పిన ఐశ్వర్య

లైంగిక వేధింపుల గురించి నోరు విప్పిన ఐశ్వర్య

Aishwarya rai response over metoo movementఎట్టకేలకు అందాల ఐశ్వర్యరాయ్ లైంగిక వేధింపుల గురించి నోరు విప్పింది . గతంలో సల్మాన్ ఖాన్ తో ప్రేమ వ్యవహారం జోరుగా సాగించిన విషయం తెలిసిందే . అయితే సల్మాన్ తో తనకు సరిపడదు అని అనుకున్న తర్వాత అతడికి బ్రేకప్ చెప్పింది కానీ అదే సమయంలో సల్మాన్ ఖాన్ ఐశ్వర్య గురించి చెడుగా మాట్లాడటం ఐశ్వర్య చెవిన పడటంతో అతడ్ని నిలదీస్తే ఐశ్వర్య ని శారీరకంగా బాగా హింసించాడట ! ఈ విషయాన్నీ 2002 లోనే చెప్పింది ఈ భామ . కట్ చేస్తే మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మీటూ ఉద్యమం సాగుతుండటంతో స్పందించింది ఐశ్వర్య రాయ్ .

ప్రపంచంలో ఏదో ఒక మూల తప్పనిసరిగా మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయని , వాటిని గురించి బాహ్య ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని ….. అందరూ ప్రత్యేకంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదని ఈ విషయాలను తెలుసుకుంటే అదే చాలని అంటోంది . మీటూ ఉద్యమం మరింత పెద్దది కావాలని , అప్పుడే ఈ లైంగిక దాడులు కొంతవరకైనా అడ్డుకట్టపడతాయని అంటోంది ఐశ్వర్యరాయ్ . సల్మాన్ ఖాన్ తో చాలా ఇబ్బందులు పడిందట ఈ భామ , అతడి టార్చర్ తట్టుకోలేక బ్రేకప్ చెప్పి అభిషేక్ బచ్చన్ ని పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే .

- Advertisement -

English Title: Aishwarya rai response over metoo movement

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All