Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్ఆమె బయోపిక్ లో నిజాలు చెబితే సంచలనమే

ఆమె బయోపిక్ లో నిజాలు చెబితే సంచలనమే

Aishwarya rai bachhan opens about her biopicబయోపిక్ లంటూ తీస్తే అసలైన నిజాలు తీయాలి అంతేకాని వాస్తవాలను దాచిపెడుతూ తీస్తే ప్రయోజనం ఏంటి ? నా బయోపిక్ తీస్తే తప్పకుండా అన్ని నిజాలే చెబుతానని , వాస్తవాలు తెలిసేలా ఉంటుందని తప్పకుండా నా బయోపిక్ గొప్ప కథ అవుతుందని అంటోంది అందాల భామ ఐశ్వర్యా రాయ్ . బాలీవుడ్ లో అలాగే టాలీవుడ్ లో బయోపిక్ ల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే . అయితే బయోపిక్ లంటూ చాలా సినిమాలు వస్తున్నాయి కానీ వాటిలో అసలైన వాస్తవాలు దాస్తున్నారని ఆరోపణలు పెద్దఎత్తున వస్తున్న దరిమిలా ఐశ్వర్యా రాయ్ స్పందించింది తన బయోపిక్ పైన .

- Advertisement -

నా జీవితం తప్పకుండా గొప్ప కథ అవుతుంది ,బయోపిక్ కోసం నిజాలు వెల్లడించడానికి నేను సిద్ధం అయితే అది ఇప్పుడే కాదు అని సెలవిచ్చింది . అంటే అమ్మడు బయోపిక్ కు సిద్దమే అయితే మాజీ లవర్స్ అయిన సల్మాన్ ఖాన్ , వివేక్ ఒబెరాయ్ ల ప్రస్తావన ఎలా ఉంటుందో చూడాలి . వాళ్ళ గురించి ఈ భామ ఏం చెబుతుంది ? ఎవరి తప్పిదం వల్ల సల్మాన్ తో ప్రేమ బ్రేకప్ అయ్యింది , ఎవరి తప్పిదం వల్ల వివేక్ ఒబెరాయ్ తో జరుగుతుంది అనుకున్న నిశ్చితార్థం రద్దయ్యింది ? ఎలా అభిషేక్ తో పెళ్లి అయ్యింది అన్నది వెలుగులోకి వస్తుందా చూడాలి .

English Title: Aishwarya rai bachhan opens about her biopic

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts