Homeటాప్ స్టోరీస్దివాలా దిశగా వోడాఫోన్ ఐడియా, భారీ నష్టాలతో ఎయిర్ టెల్

దివాలా దిశగా వోడాఫోన్ ఐడియా, భారీ నష్టాలతో ఎయిర్ టెల్

దివాలా దిశగా వోడాఫోన్ ఐడియా, భారీ నష్టాలతో ఎయిర్ టెల్
దివాలా దిశగా వోడాఫోన్ ఐడియా, భారీ నష్టాలతో ఎయిర్ టెల్

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం A.G.R (Adjusted gross revenue) కోసం భారీగా కేటాయింపులు చేయాల్సి రావడంతో, సెప్టెంబర్ త్రైమాసికంలో టెలికాం సంస్థలు వోడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ కంపెనీ లు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్తులు కనపడుతున్నాయి. సదరు బకాయిల చెల్లింపు కోసం ఈ కంపెనీలు దాదాపు 54 వేల కోట్ల రూపాయలు కేటాయించ వలసిన పరిస్థితి నెలకొంది. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీ లు మొత్తం కలిపి 74 వేల కోట్ల రూపాయల భారీ నష్టాలను ప్రకటించాయి. ఇందులో వొడాఫోన్ ఐడియా నష్టాలే సుమారు 50 వేల కోట్ల వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు మన దేశంలో ఏ కంపెనీ ఇంత భారీ నష్టాన్ని ప్రకటించలేదు. గతంలో 2018లో ఒకసారి టాటా మోటార్స్ కంపెనీ సుమారు 26 వేల కోట్ల రూపాయల నష్టాలను ప్రకటించింది.

ఇంతటి భారీ నష్టాలు చవిచూసిన నేపథ్యంలో, సదరు కంపెనీలు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కొత్తగా స్పెక్ట్రం వినియోగ చార్జీల చెల్లింపుల తో పాటు లైసెన్సు ఫీజుల చెల్లింపు రూపంలో కూడా ఈ మొత్తాన్ని వారు కేటాయించాల్సి వస్తుంది. ప్రస్తుత వ్యవహారం పట్ల ఈ సంస్థల యాజమాన్యాలు ఘాటుగానే స్పందిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి మినహాయింపులు రాని నేపథ్యంలో, దేశీయ మార్కెట్లో తాము ఎలా వ్యాపారం చేయగలుగుతాము.? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సానుకూల స్పందన పైనే తమ యొక్క సంస్థల ఊరికి భవిష్యత్తు ఆధారపడి ఉంటాయని టెలికామ్ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All