Homeటాప్ స్టోరీస్పూల‌తో ఫూల్స్‌ని చేసేసిందిగా!

పూల‌తో ఫూల్స్‌ని చేసేసిందిగా!

పూల‌తో ఫూల్స్‌ని చేసేసిందిగా!
పూల‌తో ఫూల్స్‌ని చేసేసిందిగా!

పూల‌తో వున్నానంటూ ఫూల్స్‌ని చేసేసింది బ‌న్నీ హీరోయిన్ అదాశ‌ర్మ‌. దేశీ బాడీగాడ్ కావాలంటే త‌న‌ని సంప్ర‌దించండి అంటూ స‌వాల్ విసిరిన అదా సిలంబం ( క‌ర్ర‌సాము)కు సంబంధించిన వీడియోని పోస్ట్ చేసి ఎవ‌రికైనా కావాలా నాలాంటి బాడీగార్డ్ అంటూ ఛాలెంజ్ చేసింది. ఆ త‌రువాత చేతిలో పెద్ద‌గా సినిమాలు లేక‌పోయినా సోష‌ల్ మీడియాని అడ్డాగా చేసుకుని వ‌రుస వీడియోలు, ఫొటోల‌తో క‌వ్విస్తోంది.

తాజాగా యెద అందాల‌ని క‌వ‌ర్ చేస్తూ ఫ్ల‌వ‌ర్స్‌ని అడ్డుగా పెట్టుకున్న ఓ ఫొటోని సోష‌ల్ మీడియాలో అభిమానుల కోసం షేర్ చేసింది. ఈ ఫొటో చూసిన నెటిజ‌న్స్ అదా అందాల‌కు పిచ్చెక్కిపోతున్నారు. అయితే ఈ ఫొటోకి క్యాప్ష‌న్‌గా `పూల‌ని చూసి మీరు ఫూల్స్ అయ్యారా` అంటూ పోస్ట్ చేసింది. దీంతో నెటిజ‌న్స్ అవాక్క‌వుతున్నారు.

- Advertisement -

పింక్ అండ్ బ్లూ క‌ల‌ర్ లెహెంగా ధ‌రించి యెద‌పై కేవ‌లం ఫ్ల‌వ‌ర్స్‌ని మాత్ర‌మే అడ్డుగా పెట్టుకుని ఫొటోల‌కు అదా పోజులిచ్చింది. అయితే అందులో ఏదో మ్యాజిక్ వుంద‌నే అర్థం వ‌చ్చేలా పువ్వులు చూసి ఫూల్స్ అయ్యారా అంటూ కామెంట్ చేసింది. దీంతో అదాశ‌ర్మ బోల్డ్ షో నిజ‌మా అబ‌ద్ధామా అనే క‌న్ఫ్యూజ‌న్‌లో వుండిపోయారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All