Homeటాప్ స్టోరీస్హీరోయిన్ ఆదాశ‌ర్మ ప్రేమ‌లో ప‌డిందా?

హీరోయిన్ ఆదాశ‌ర్మ ప్రేమ‌లో ప‌డిందా?

హీరోయిన్ ఆదాశ‌ర్మ ప్రేమ‌లో ప‌డిందా?
హీరోయిన్ ఆదాశ‌ర్మ ప్రేమ‌లో ప‌డిందా?

ఆదా శ‌ర్మ.. తెలుగులో చేసింది త‌క్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. అయితే ఆ పేరు తెచ్చుకుంది మాత్రం సినిమాల‌తో కాదు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ హాట్ ఫొటోఉ, వీడియోల‌తో. హాట్ యోగా చేస్తూ వార్త‌ల్లో నిలిచిన ఆదా శ‌ర్మ తెలుగులో `హార్ట్ ఎటాక్‌`, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్, క‌ల్కీ చిత్రాల్లో న‌టించింది.

తెలుగులో చెప్పుకోద‌గ్గ అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్క‌డ కామెండో 2, క‌మెండో 3 చిత్రాల్లో న‌టించింది. ఈ రెండు చిత్రాల్లో విద్యుత్ జంవాల్ హీరోగా న‌టించాడు. విజ‌య్ హీరోగా న‌టించిన `తుపాకి` చిత్రంలో విల‌న్‌గా, సూర్య హీరోగా న‌టించిన `సికింద‌ర్‌` చిత్రంలో స్నేహితుడిగా విద్యుత్ న‌టించారు.

- Advertisement -

ఈ సినిమా టైమ్‌లో విద్యుత్, ఆదాశ‌ర్మ మ‌ధ్య స్నేహం ఏర్ప‌డింద‌ని, అది కాస్తా ప్రేమ‌గా మారింద‌ని బాలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌త కొంత కాలంగా ఇద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ట‌. ఈ విష‌యాన్ని తాజాగా బాలీవుడ్‌కు చెందిన ఓ మీడియా సంస్థ వెల్ల‌డించింది. దీనిపై ఆదా కానీ, ఇద్యుత్ కానీ స్పందించ‌లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All