Homeటాప్ స్టోరీస్ఆక‌ట్టుకుంటున్న సూర్య మేకింగ్ వీడియో!

ఆక‌ట్టుకుంటున్న సూర్య మేకింగ్ వీడియో!

ఆక‌ట్టుకుంటున్న సూర్య మేకింగ్ వీడియో!
ఆక‌ట్టుకుంటున్న సూర్య మేకింగ్ వీడియో!

సూర్య ఏదైనా సినిమా అంగీక‌రిస్తే దాని కోసం ప్రాణం పెడ‌తాడు. ఈ విష‌యం చాలా సంద‌ర్భాల్లో రుజువైంది కూడా. సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్‌` చిత్రం కోసం 13 ఏళ్ల కుర్రాడిగా మారి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన సూర్య ఆ త‌రువాత కూడా అఏ త‌ర‌హా ప్ర‌యోగాలు చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న తాజా త‌మిళ చిత్రం `సూరరాయి పోట్రు`. సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో `ఆకాశ‌మే హ‌ద్దురా` పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

ఏయిర్ డెక్క‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జి.ఆర్‌. గోపీనాథ్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే జి.ఆర్‌. గోపీనాథ్ బ‌యోపిక్ అన్న‌మాట‌. ఈ చిత్రాన్ని ఈ నెల‌లోనే రిలీజ్ చేయాల‌నుకున్నారు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో వాయిదా వేశారు. ఈ చిత్రంలోని కొన్ని కీల‌క స‌న్నివేశాల్లో హీరో సూర్య 19 ఏళ్ల యువ‌కుడిగా క‌నిపించాల్సి వుంది. 44 ఏళ్ల వ‌య‌సున్న సూర్య 19 ఏళ్ల యువ‌కుడిగా ఎలా మారాడు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -

దీనికి సంబంధించిన మేకింగ్ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. సూర్య 19 ఏళ్ల యువ‌కుడిగా మార‌డం కోసం ఎలాంటి క‌స‌ర‌త్తులు చేశాడు, ఎలాంటి డైట్‌ని పాటించాడ‌న్న‌ది ఈ వీడియోలో చూపించారు. ఈ వీడియో చూఇన వారంతా హ్యాట్సాఫ్ సూర్య అంటు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All