Homeటాప్ స్టోరీస్“స్ట్రాంగ్ ఈజ్ ద సెక్సీ” – వరలక్ష్మి శరత్ కుమార్

“స్ట్రాంగ్ ఈజ్ ద సెక్సీ” – వరలక్ష్మి శరత్ కుమార్

“స్ట్రాంగ్ ఈజ్ ద సెక్సీ” – వరలక్ష్మి శరత్ కుమార్
“స్ట్రాంగ్ ఈజ్ ద సెక్సీ” – వరలక్ష్మి శరత్ కుమార్

తమిళ నటుడు, హీరో శరత్ కుమార్ గారి కుమార్తె వరలక్ష్మి తాజాగా తన సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే సొసైటీలో మరియు సినిమా ఇండస్ట్రీ లో జరిగే అనేక రకాల విషయాలపై తనదైన శైలిలో మాటల తూటాలు పేలుస్తూ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు ఆమె. గతంలో కూడా తను ఒక స్టార్ హీరో ఫ్యామిలీ కు చెందిన వ్యక్తిని అయినప్పటికీ తనను కొంతమంది వేధించారని కూడా ఆమె చెప్పారు.

ఇక ఇప్పుడు తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ తన జిమ్ లో వ్యాయామం చేస్తున్న ఒక వీడియో షేర్ చేసారు. అందులో భాగంగా ఒక ట్యాగ్ లైన్ కూడా పంచుకున్నారు. అందానికి, ఆకర్షణకు ఆమె కొత్త అర్ధం చెప్పారు. అందంగా, లైంగికంగా ఆకర్షించే విధంగా ఉండటం అంటే, ఆరోగ్యకరంగా,బలంగా ఉండటమే అని డెఫినిషన్ ఇస్తున్నారు. ఇక గతంలో కూడా తనకు అందాలు ఆరబోసే పాత్రల కన్నా, నటనకు ఆస్కారం ఉండే క్యారెక్టర్ లు చెయ్యడమే ఇష్టం అని చెప్పారు. ఇక గతంలో కూడా ఆమె నటించిన “సర్కార్” సినిమాలో వరలక్ష్మి పోషించిన పాత్ర దివంగత ముఖ్యమంత్రి జయలలితను పోలి ఉందనీ… ఆమెను అగౌరవపరిచే విధంగా ఉందని కూడా వివాదాలు జరిగాయి.

- Advertisement -

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All