Homeటాప్ స్టోరీస్యోగాస‌నాలు వేస్తున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌!

యోగాస‌నాలు వేస్తున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌!

యోగాస‌నాలు వేస్తున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌!
యోగాస‌నాలు వేస్తున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌!

కె. భాగ్య‌రాజా రూపొందించి న‌టించిన చిత్రం `గౌర‌మ్మా నీ మొగుడెవ‌ర‌మ్మా` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో సంచ‌ల‌నం సృష్టించింది ప్ర‌గ‌తి. అప్ప‌టి నుంచి హీరోయిన్‌గా, ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్తిస్ట్‌గా బిజీగా మారింది. హీరోయిన్‌ల‌కు, హీరోల‌కు త‌ల్లిగా, అత్త‌గా, పిన్నిగా.. ఇలా విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ బిజీగా వుంది. సీనియ‌ర్ హీరోలు, క్రేజీ హీరోల చిత్రాల్లో న‌టిస్తూ కామెడీని కూడా పండిస్తున్న న‌టి ప్ర‌గ‌తి లాక్‌డౌన్ వేళ వార్త‌ల్లో నిలుస్తోంది.

లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమితం అయిపోయిన ప్ర‌గ‌తి ఇటీవ త‌మిళ హీరో విజ‌య్ న‌టించిన `మాస్ట‌ర్` చిత్రంలోని ఊర నాటు మాస్ బీట్‌కి స్టెప్పులేసి హంగామా చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. తాజాగా వ‌ర్క‌వుట్లు చేస్తున్న ఫొటోల‌ని పోస్ట్ చేసింది.

- Advertisement -

నాలుగు ప‌దుల వ‌య‌సు‌లో ఫిట్ నెస్ కోసం న‌టి ప్ర‌గ‌తి చేస్తున్న యోగాస‌నాల‌కు సంబంధించిన షొటోలు నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ ఫొటోల‌కు మై హోమ్ గుడ్ వ‌ర్క‌వుట్ డే అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన నెటిజ‌న్స్ న‌మ్మ‌లేక‌పోతున్నాం అంటూ అవాక్క‌వుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All