Homeటాప్ స్టోరీస్వీరేంద్ర చౌద‌రిని ఆడేసుకుంటోందిగా!

వీరేంద్ర చౌద‌రిని ఆడేసుకుంటోందిగా!

వీరేంద్ర చౌద‌రిని ఆడేసుకుంటోందిగా!
వీరేంద్ర చౌద‌రిని ఆడేసుకుంటోందిగా!

తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల‌ని హాట్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపిన న‌టి న‌మిత‌. భారీ అందాల‌తో కుర్ర కారుని కిర్రెక్కించింది. టాప్ స్టార్స్‌తో క‌లిసి ఆడిపాడింది. కెరీర్ ఇక డ‌ల్ అవుతోంది అనుకుంటున్న త‌రుణంలో బాయ్ ఫ్రెండ్ వీరేంద్ర చౌద‌రిని పెళ్లాడింది. 2017లో తిరుప‌తిలో వీరి వివాహం జ‌రిగింది. అప్ప‌టి నుంచి సినిమాల్లో న‌టించ‌డం క్ర‌మంగా త‌గ్గించిన న‌మిత నిత్యం సోష‌ల్  మీడియా ద్వారా అభిమానుల‌కు అందుబాటులో వుంటోంది.

తాజాగా త‌న భ‌ర్త వీరేంద్ర చౌద‌రితో క‌లిసి స‌ర‌దాగా గ‌డుపుతున్న ఓ ఫొటోని షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. భ‌ర్త వీరేంద్ర చౌద‌రికి ముద్దు పెడుతున్న ఫొటో నెట్టింట్లో సంద‌డి చేస్తోంది. ఈ సంద‌ర్భంగా ఈ ఫొటోల‌తో పాటు ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ని న‌మిత షేర్ చేసింది. ఓ ఫొటోలో త‌న భ‌ర్త బెడ్‌పై ప‌డుకును వుండ‌గా వీపుపై న‌మిత కూర్చుని చిరున‌వ్వులు చిందిస్తోంది.

- Advertisement -

`మేం ఇద్ద‌రం క‌లుసుకుని నాలుగు సంవ‌త్స‌రాల‌వుతోంది. ఈ ప్ర‌యాణంలో న‌దిలో ప్ర‌వాహంలా సాగాం. ఇంకా 40 ఏళ్లు ఇలాగే చీర్స్‌..! అంటూ భ‌ర్త బుగ్గ‌పై ముద్దు పెడుతున్న ఫొటోని షేర్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All