సినిమా స్టార్లని, సెలబ్రిటీలని బ్లాక్ మెయిల్ చేయడం ఇటీవలీ కాలంలో ఎక్కువైపోయింది. డబ్బులు గుంజడం.. లేదంటే మరోలా బ్లాక్ మెయిల్ చేయడం చేస్తున్నారు. అయితే అలాంటి వాళ్లకి స్టార్స్ తెలివిగా చెక్ పెడుతున్నారు. హాట్ హీరోయిన్ నమిత తాజాగా ఓ ఫ్రాడ్ని అడ్డంగా బుక్ చేసింది. బొద్దు గుమ్మగా పేరు తెచ్చుకున్న నమితకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువే. భారీ అందాలతో ఆకట్టుకుంటున్న నమిత హీరోయిన్గా క్రేజీ చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం డిమాండ్ తగ్గడంతో ప్రాధాన్యత వున్న పాత్రల్లో నటిస్తోంది. ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తోంది. అయితే ఇటీవలే వివాహం చేసుకున్న నమితని ఓ యువకుడు గత కొంత కాలంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడట. నిమితకు సంబంధించిన వల్గర్ వీడియోలు తన దగ్గర వున్నాయని, తను అడిగింది చేయకపోతే వాటిని యూట్యూబ్లో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో పక్కా ప్లాన్ వేసిన నమిత తనని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్న వాడి బండారం బయట పెట్టేసింది.
- Advertisement -
డీఎమ్ (ఐయామ్ తమిళ్ సెంతమిళ్ ఇన్స్టా యూజర్ నేమ్) అనే ఈ చీప్ మైండెడ్ ఫెల్లో తనకు ఫోన్ చేస్తున్నాడని, ఐటమ్ అని సంబోధిస్తూ తనకు సంబంధించిన పోర్న్ వీడియోలు తన దగ్గర వున్నాయని. వాటిని ఆన్ లైన్లో పెట్టేస్తానని రోజూ బెదిరిస్తున్నాడని వెల్లడించింది నమిత. సోషల్ మీడియా ఇన్స్టా లో సుదీర్ఘమైప ఓపోస్ట్ ద్వారా తనని వేధిస్తున్న ఫ్రాడ్ బండారాన్ని బయటపెట్టింది. దీంతో నెటిజన్స్ నమితని అభినందిస్తున్నారు. తగిన బుద్ధి చెప్పారంటూ ప్రశంసిస్తున్నారు.