Wednesday, March 22, 2023
Homeటాప్ స్టోరీస్బస్తీమే సవాల్ అంటున్న శివాజీరాజా

బస్తీమే సవాల్ అంటున్న శివాజీరాజా

actor sivajiraja challenges on controversyనాపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే గుండు కొట్టించుకుంటానని అలాగే నాయావదాస్థిని రాసిస్తానని లేకపోతే ఆరోపణలు చేసిన వాళ్ళు ఏం చేస్తారని బస్తీమే సవాల్ అని అంటున్నాడు మా అధ్యక్షుడు శివాజీరాజా . మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి గా ఆమధ్య విదేశాలలో ఓ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే అయితే ఆ ఈవెంట్ లో కేవలం కోటి రూపాయలు మాత్రమే వసూల్ అయ్యాయా ? మెగాస్టార్ స్టామినా అంతేనా ? ఈ వ్యవహారంలో శివాజీరాజా తో పాటుగా హీరో శ్రీకాంత్ కూడా కొంత నొక్కేశారని కథనాలు రావడంతో శివాజీరాజాతో పాటుగా శ్రీకాంత్ కూడా సవాల్ విసురుతున్నాడు ప్రత్యర్థులకు .

- Advertisement -

మరో నాలుగు నెలల్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఉన్నందున ఇప్పుడే తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నాడు శివాజీరాజా . కోటి రూపాయల ఫండ్ ఏర్పాటు చేయాలనుకున్నాం చేసాం , మహేష్ బాబు , ప్రభాస్ లతో మరో ఈవెంట్ చేస్తాం దాని ద్వారా సమకూరే మొత్తంతో మా అసోసియేషన్ కు సొంత బిల్డింగ్ కడతామని అంటున్నారు . మొత్తానికి ఎన్నికలు రాబోతున్న ఈ తరుణంలో మాలో లుకలుకలు బయటపడుతున్నాయి .

English Title: actor sivajiraja challenges on controversy

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts