Homeటాప్ స్టోరీస్యాక్షన్ మూవీ రివ్యూ

యాక్షన్ మూవీ రివ్యూ

యాక్షన్ మూవీ రివ్యూ
యాక్షన్ మూవీ రివ్యూ

నటీనటులు: విశాల్, తమన్నా, ఐశ్వర్య, రాంకీ, సాయాజీ షిండే తదితరులు
దర్శకత్వం: సుందర్ సి
నిర్మాత: రవీంద్రన్
సంగీతం: హిప్ హాప్ తమిళ
విడుదల తేదీ: నవంబర్ 15, 2019
రేటింగ్: 2.5/5

తెలుగువారికి సుపరిచితమైన విశాల్ ఎక్కువగా యాక్షన్ సినిమాలతోనే గుర్తింపు పొందాడు. రీసెంట్ గా డీసెంట్ హిట్స్ కొడుతున్న విశాల్ యాక్షన్ అనే మరో యాక్షన్ థ్రిల్లర్ తో మన ముందుకు వచ్చాడు. తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి విడుదలైన యాక్షన్ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

కథ:
సుభాష్ (విశాల్) సీఎం తనయుడు, ఆర్మీ ఆఫీసర్ గా పనిచేస్తుంటాడు. ఒకరోజు సీఎం సుభాష్ బ్రదర్ ను కాబోయే సీఎం అని ప్రకటిస్తాడు. ఈ సందర్భంగా జరిగే ఒక మీటింగ్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగి సుభాష్ తన ఫ్యామిలీలో చాలా మందిని పోగొట్టుకుంటాడు. అసలు ఈ బాంబు బ్లాస్ట్ ఎవరు చేసారు అన్న విచారణ చేయగా దీని వెనకాల ఒక అంతర్జాతీయ టెర్రరిస్ట్ ఉన్నాడన్న విషయం అర్ధమవుతుంది. అప్పుడు సుభాష్ ఏం చేస్తాడు? తన ఫ్యామిలీను ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? వీళ్ళని ఎలా మట్టుబెడతాడు అన్నది సినిమా కథ.

నటీనటులు:
విశాల్ మరోసారి పవర్ ప్యాకెడ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. విశాల్ సొంతంగా పెర్ఫర్మ్ చేసిన ఫైట్స్ ఆకట్టుకుంటాయి. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు. మరోసారి తనకు సూట్ అయ్యే కథను ఎంచుకున్నాడు విశాల్. తమన్నాకు మంచి ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది. పాటల్లో గ్లామరస్ గా ఉంటూనే నటనకు ప్రాధాన్యమున్న పాత్రను చేసింది. సాయాజీ షిండే తన పాత్రను సమర్ధవంతంగా పోషించాడు. మిగతా వారంతా కూడా తమ పాత్ర పరిధుల మేరకు మంచి ఔట్పుట్ ఇచ్చారు.

సాంకేతిక వర్గం:
యాక్షన్ సినిమాలో ముందుగా అందరూ నోటీసు చేసేది నిర్మాణ విలువల గురించే. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కిన ఫీలింగ్ కలుగుతుంది. హిప్ హాప్ తమిళ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్టాండ్ అవుట్ గా నిలుస్తుంది. యాక్షన్ డైరెక్టర్ గురించి కూడా ప్రస్తావించుకోవాలి. యాక్షన్ సీన్లు అలరిస్తాయి. డబ్బింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. జాగ్రత్తలు బానే తీసుకున్నారు. ఎడిటింగ్ కూడా ఓకే. దర్శకుడు సుందర్ ఈ సినిమాకు మంచి సెటప్ ఎంచుకున్నాడు. ఫస్ట్ హాఫ్ ను చాలా బాగా డీల్ చేసాడు. సినిమా అంతటా సస్పెన్స్ ను బాగా మైంటైన్ చేసాడు. అయితే ఒక దశ దాటాక యాక్షన్ బోర్ కొట్టిస్తుంది. ఈ విషయంలో కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లైతే సూపర్బ్ యాక్షన్ థ్రిల్లర్ గా యాక్షన్ చిత్రం నిలిచిపోయేది.

చివరిగా:
విశాల్ నుండి వచ్చిన మరో యాక్షన్ థ్రిల్లర్ ఈ యాక్షన్. సూపర్బ్ ఫైట్ సీక్వెన్సెస్, హీరోయిన్ల గ్లామర్, సస్పెన్స్ ఫ్యాక్టర్ ఇవన్నీ యాక్షన్ చిత్రాన్ని టాప్ స్థాయిలో నిలబెడతాయి. అయితే ఫస్ట్ హాఫ్ సూపర్బ్ గా వర్కౌట్ అయింది. సస్పెన్స్ ఫ్యాక్టర్ కూడా బాగా మైంటైన్ చేసారు. కానీ సెకండ్ హాఫ్ లో సినిమా గాడి తప్పుతుంది. ఆఖరి అరగంట సినిమా బాగా రొటీన్ గా డీల్ చేయడంతో ఒక సాధారణ యాక్షన్ థ్రిల్లర్ చూసిన భావన కలుగుతుంది. ఈ పార్ట్ కనుక కొంచెం జాగ్రత్త తీసుకున్నట్లైతే యాక్షన్ మరో స్థాయిలో ఉండేది. ఏదేమైనా యాక్షన్ చిత్రాన్ని యాక్షన్ జోనర్ ను ఇష్టపడే ప్రేక్షకులు ఒకసారి చూడవచ్చు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All