
మరో వారం రోజులో విడుదల కానున్న సైరా నరసింహారెడ్డికు హైప్ పెంచే విధంగా సైరా చిత్ర బృందం లేటెస్ట్ గా మరో ట్రైలర్ ను వదిలారు. నిమిషం నిడివున్న ఈ ట్రైలర్ లో పోరాట సన్నివేశాలు ఎక్కువ ఉండేలా చూసుకున్నారు. ఈ ట్రైలర్ తో అంచనాలు డబల్ అయ్యాయి. ఈ ట్రైలర్ పై అన్ని వర్గాల నుండి మంచి స్పందన వస్తోంది.
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తోన్న రామ్ గోపాల్ వర్మ ఈ ట్రైలర్ పై స్పందించాడు. సహజంగా దేని మీదైనా నెగటివ్ గా మాట్లాడే వర్మ, ఈ ట్రైలర్ ను మాత్రం తెగ పొగిడేసాడు. చిరంజీవికి, తెలుగు ప్రేక్షకులకు ఇంత గొప్ప బహుమతినిచ్చిన రామ్ చరణ్ కు ధన్యవాదాలు తెలిపిన వర్మ, సైరా అనేది మెగాస్టార్ అనే పదానికి సరైన నిర్వచనం ఇచ్చే సినిమాగా కొనియాడారు. ట్రైలర్ ను ప్రస్తావిస్తూ వావ్ అనడం కొసమెరుపు.
వర్మ పొగిడాడనని కాదు కానీ ఈ ట్రైలర్ నిజంగా సరైన అంచనాల్ని నెలకొల్పడంలో విజయవంతమైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా అక్టోబర్ 2న విడుదల కానున్న సంగతి తెల్సిందే.