Homeటాప్ స్టోరీస్ఇదొక అజ్ఞాతవాసం ఇంట్లోనే వుండండి: అర్జున్‌

ఇదొక అజ్ఞాతవాసం ఇంట్లోనే వుండండి: అర్జున్‌

ఇదొక అజ్ఞాతవాసం ఇంట్లోనే వుండండి: అర్జున్‌
ఇదొక అజ్ఞాతవాసం ఇంట్లోనే వుండండి: అర్జున్‌

క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచం, దేశం దుర్భ‌ర ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఈ స‌మ‌యంలో మ‌న‌కు అండ‌గా నిలుస్తూ ప్రాణాల‌ని సైతం ప‌ణంగా పెట్టి ప‌నిచేస్తున్న డాక్ల‌ర్ల‌ని, పోలీసుల్ని దేవుళ్లుగా భావించాలే కానీ వారిపై దాడులు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాదు. ఇంటి నుంచి ఎవ‌రూ బ‌య‌టికి వెళ్ల‌కూడ‌దని ప్ర‌భుత్వం మ‌న‌కు ఆదేశాలిచ్చింది. కానీ 20 శాతం మంది ఈ విష‌యాన్ని అర్థం చేసుకోవ‌డం లేదు. అలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావ‌డం లేదు అని అస‌హనాన్ని వ్య‌క్తం చేశారు హీరో అర్జున్‌.

క‌రోనా కార‌ణంగా టోట‌ల్ వ‌ర‌ల్డ్ లాక్‌డౌన్ లో వుంది. ఇంత సీరియ‌స్ విష‌యాన్ని కొంచెం కామ‌న్సెన్స్‌ని ఉప‌యోగించి అర్థం చేసుకోవాలి. ద‌య‌చేసి ఈ స‌మ‌యంలో ఇంటి నుంచి బ‌య‌టికి రాకండి. ఇంత‌ద క‌న్నా ప్ర‌భుత్వం ఏం చేస్తుంది చెప్పండి. మీ ఇంట్లో మిమ్మ‌ల్ని వుండ‌మ‌ని చెబుతున్నారు. మీ పిల్ల‌లతో క‌లిసి వుండ‌మ‌ని చెబుతున్నారు. త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఉండ‌మ‌ని చెబుతోంది. డ‌బ్బులు కూడా ఇస్తోంది. ఇంత క‌న్నా ప్ర‌భుత్వం ఏం చేస్తుంది చెప్పండి. ద‌య‌చేసి మిమ్మిల్ని మీరు కాపాడు కోవ‌డానికి ఇంట్లోనే వుండండి. ఇది కొన్ని రోజులు మాత్ర‌మే వుంటుంది. ఇదొక అజ్ఞాత‌వాసం అనుకోండి. ఈ టైమ్‌లో మ‌నం ఇంట్లోనే వుండాలి. దీన్ని మ‌నం పాజిట‌వ్‌గా తీసుకోవాలి` అన్నారు అర్జున్‌.

- Advertisement -

ద‌య‌చేసి ఇంట్లో వుండండి. ఈ స‌మ‌యంలో వీడియోల్లో ఓ దారుణ విష‌యాల‌ని చూశాను. కొంత మంది పోలీసుల్ని, డాక్ట‌ర్ల‌ని కొట్టేస్తున్నారు. వాళ్ల‌ని కాపాడాల‌ని వ‌చ్చిన వారిని కొట్టేస్తున్నారు. డాక్ల‌ర్లు అంటే ఈ స‌మ‌యంలో దేవుడు. అలాంటి వాళ్లు త‌మ వాళ్ల‌కి దూరంగా వుంటూ నిత్యం మ‌న కోసం ప‌నిచేస్తుంటే వాళ్ల‌ని కొట్టేస్తున్నారు. వాళ్ల‌కి పూజ చేయాల్సింది పోయి వాళ్ల‌ని కొట్ట‌డం జ‌నాల్లో మాన‌వ‌త్వం చ‌చ్చిపోయిందా? అని పిస్తోంది. పోలీసుల్ని కూడా అలాగే కొట్టేస్తున్నారు. సొంత వాళ్ల‌ని ప‌క్క‌న పెట్టి మ‌న కోసం వైర‌స్ రిస్క్ వున్నా స‌రే వైద్యం చేస్తున్నారు. వాళ్ల‌ని కాపాడుకుందాం. త‌ద్వారా స‌మాజాన్ని, దేశాన్ని కాపాడుకుందాం` అని హీరో అర్జున్ పిలుపునిచ్చారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All